ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పర్యటనలు టీడీపీ పరువును బజారుకీడుస్తున్నాయని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అయితే, మంత్రి లోకేష్‌పై టీడీపీ నేతలు అలా అభిప్రాయపడటానికి కారణాలు లేకపోలేదు. టీడీపీ ఏర్పాటు చేసిన ఏ సభలోనైనా నారా లోకేష్ మాట్లాడటం.. తాను మాట్లాడుతున్నది వాస్తవమా..? అవాస్తవమా..? తప్పా..? ఒప్పా..? పదాలు సరిగ్గా పలుకుతున్నామా..? లేదా..? అనేవి చూసుకోకుండా తన నోటికి ఎంత వస్తే అంత.. ఏది పడితే అది మాట్లాడటం లోకేష్ వంతైంది. ఈ క్రమంలోనే తడబాటుకు లోనవుతున్న లోకేస్ వర్ధంతి రోజున పుట్టిన రోజుశుభాకాంక్షలు తెపపడం. పుట్టిన రోజున వర్ధంతి శుభాకాంక్షలు అంటూ చెప్పడం సర్వ సాధారణమైపోయింది. ఇలా నారా లోకేష్ గురించి చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇదిలా ఉండగా, మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లా నందవరం గ్రామంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, నారా లోకేష్ సభకు ప్రజలను తరలించేందుకు ఆ పార్టీ నేతలు చాలానే ఇబ్బందులు పడ్డారట. చివరకు మనిషికి రూ.వెయ్యి, ఒక మందు బాటిల్ చెప్పున ఇచ్చి మనుషులను తరలించారని, ఆ క్రమంలో సభలో పాల్గొన్న పచ్చ తమ్ముళ్లకు మందు బాటిళ్లు పంచుతూ ఆ పార్టీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. ఆ వీడియో మీ కోసం.