ఏపీ మహిళలపై లైంగిక దాడులు ఆగడంలేదు. ఎక్కడ చూసిన రోజు ఖచ్చితంగా మహిళలపై అత్యచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజధానిలో మరో దారుణం చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఓ మహిళపై ఓ యువకుడు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. విజయవాడలో ప్రేమ పేరుతో యువతికి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి ఓ యువకుడు అత్యాచారం చేశాడు. అంతేగాక ఈ విషయం ఎవరితో చెప్పకుండా ఉంటే పెళ్లి చేసుసుకుంటానని యువతిని నమ్మించాడు. ఆ తర్వాత యువకుడుని పెళ్లి చేసుకోమని బాధిత యువతి అడగ్గా గత రెండు నెలల నుండి మొహం చాటేస్తున్నాడు. దీంతో బాధిత యువతి కొత్తపేట పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
