ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్న రాష్ట్ర బంద్‌లో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. కాగా, ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా బుట్టాయగూండెంలో జరిగిన బంద్‌లో వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతోపాటు బుట్టాయగూడెం పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు ఏపీ బంద్‌లో పాల్గొన్నారు.
అయితే, శాంతియుతంగా జరుగుతున్న బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు సర్కార్ పలు పన్నాగాలు పన్నింది. అధికార బలంతో పోలీసులను ఉసిగొల్పింది. దీంతో ప్రత్యేక హోదా కోసం ఏపీ వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్ చేస్తున్న వైసీపీ నేతలను, నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి, ఈడ్చుకుంటూ తీసుకెళ్లి జైళ్లలో వేశారు. ఈ క్రమంలోనే బుట్టాయగూడెంకు చెందిన వైసీపీ కార్యకర్త కాకి దుర్గారావు మృతి చెందాడు.