గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేయిస్తూ సీఎం జగన్‌ను, వైసీపీ మంత్రులను కించపర్చేలా చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. తమ జూనియర్ ఆర్టిస్టులతో రైతు, వరద బాధితుల అవతారాలు ఎత్తించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి చుక్కెదురు అయింది. తాజాగా వైఎస్ జగన్ సర్కార్‌పై బురద చల్లడమే కాకుండా, పలువురు మంత్రులను కులం పేరుతో దూషించిన నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం అయిందంటూ ఆర్టిస్టులతో ప్రచారం చేయించింది. వీరంతా మంత్రిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర భాషలో, అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేసి, ఐపీసీ సెక్షన్ 120 B కింద (కుట్రపూరిత) కేసు నమోదు చేశారు. ఈ వీడియో వెనుక నిర్మాత, దర్శకుడిని పోలీసులు గుర్తించారు. టీడీపీ అందించిన డబ్బులతోనే ఈ వీడియో నిర్మించినట్లు గుర్తించారు. వీడియో రికార్ట్ చేసిన ప్రాంతాన్ని సైతం పోలీసులు గుర‍్తించారు. ఈ కేసును డీజీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నలుగురు పెయిడ్ ఆర్టిస్టుల అరెస్ట్‌తో గత కొద్ది రోజులుగా వరద సహాయక చర్యల విషయంలో, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా టీమ్‌కు మైండ్ బ్లాక్ అయినట్లైంది. దీంతో సోషల్ మీడియాలో తాము పెట్టిన పోస్ట్‌లు, వీడియోలు హడావుడిగా తొలగించే పనిలో పడింది..లోకేష్ టీమ్. ఇలా పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వాన్ని బద్నాం చేయడం వెనుక లోకేష్ హస్తం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో లోకేష్ పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆల్రెడీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో దూషించిన శేఖర్ చౌదరి అనే పెయిడ్ ఆర్టిస్ట్..తాను టీడీపీ సోషల్ మీడియా చేయమన్నట్లే చేశా అని పోలీసులకు వివరించినట్లు సమాచారం. కాగా టీడీపీ సోషల్ మీడియా వ్యవహారాలు మొత్తం లోకేష్ కనుసన్నలలో నడుస్తోంది. సో..మొత్తంగా ఈ పెయిడ్ ఆర్టిస్ట్‌ల కేసు లోకేష్‌కు మెడకు కూడా చుట్టుకోనుందని, త్వరలోనే జైలుకు పోవడం ఖాయమని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
