నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు. 69 వ జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల అధిపతులు, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇవాళ మోదీ బర్త్‌డేను పురస్కరించుకుని..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. జీవితాంతం ఇలానే సంతోషంగా, ఆరోగ్యంగా ప్రజా జీవితంలో ఉండాలి’అంటూ జగన్ ట్వీట్ చేశారు. జగన్ శుభాకాంక్షలపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ నా పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలిపిన మీకు ధన్యవాదాలు జగన్ జీ !’ అంటూ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్ద ఎత్తున మోదీకి బర్త్‌డే విషెస్ చెబుతూ నెట్‌జన్లు రీట్వీట్స్ చేస్తున్నారు.
