ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.. అయితే అనూహ్యంగా జగన్ డిల్లీ పర్యటన రద్దు అయింది. కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసేందుకు జగన్ ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నారు. ఆ అయితే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా బిజీగా ఉన్నారు.. కొన్ని రోజులముందే జగన్, అమిత్ షాల మీటింగ్ కన్ఫర్మ్ అయింది. కానీ అనుకోకుండా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి షా వెళ్లనున్నారు.. ఈ కారణంతోనే అమిత్ షా బిజీ అయ్యారు. అందువల్ల ఢిల్లీ పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు. అయితే అమిత్ షా ను కలిసి సీఎం జగన్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించనున్నారు.
