ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియభర్త భార్గవరామ్ మరోసారి హైదరాబాద్‌లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఓ కేసు నిమిత్తం తనను పట్టుకోవడానికి వచ్చిన ఆళ్లగడ్డ పోలీసుల జీపును గుద్దే ప్రయత్నం చేసి తప్పించుకుపోయిన భార్గవరామ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇటు హైదరాబాద్ పోలీసులు, అటు ఏపీ పోలీసులు భార్గవరామ్ కోసం వెదుకుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో భార్గవరామ్ ఏపీ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఉదంతం బయటకు వచ్చింది. యూసుఫ్‌గూడలో భార్గవ్ రామ్‌కు తమకు చెందిన మహాత్మాగాంధీ స్కూల్‌లో ఉన్నట్లు సమాచారం ఉండటంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్గవ్ తో పాటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆయన అనుచరులు పోలీసులపై దౌర్జన్యం చేశారు. కానిస్టేబుల్ సెల్‌ఫోన్ లాక్కుని బయటకు నెట్టేశారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించి భార్గవరామ్ అనుచరులు పవన్, బిన్నయ్య, చిన్నయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మొత్తంగా రెండు సార్లు తమపై రెండుసార్లు దౌర్జన్యం చేసిన అఖిల ప్రియ భర్త భార్గవరామ్ తీరుపై ఏపీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులే తమపై దాడికి పాల్పడ్డారని అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. మొత్తంగా అఖిలప్రియ భర్త భార్గవరామ్ వ్యవహారం మళ్లీ చర్చనీయాశంగా మారింది.