తెలుగుదేశం పార్టీ చేస్తున్న మరో అక్రమ కార్యక్రమం వెలుగుచూసింది. రాజధానిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 3. 50 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే 1993లో పేదలకు పంచాలని ఇచ్చిన భూమిని ఇప్పటివరకు గత ప్రభుత్వాలు కేటాయించలేకపోయాయి. అయితే టీడీపీ ఇదే అవకాశంగా చేసుకొని పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ఈ స్థలంలో చేపడుతుంది. దీంతో తో విచారణ జరపగా హైకోర్టు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం వ్యతిరేకించింది. ప్రస్తుతం విషయం బయటకు రావడంతో అక్రమ కట్టడంగా భావించి జగన్ ప్రభుత్వం దీన్ని కూల్చివేస్తుందా లేదా జరిమానా విధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
