రైతు శ్రేయస్సు కొరకు ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.. ఇప్పటికే రైతులకు పెట్టుబడి సాయం పేరుతో పెద్దఎత్తున నిధులు విడుదల చేసిన సర్కార్ వన్ స్టాప్ షాప్ పేరుతో రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోను గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సచివాలయం పక్కనే రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు ఔషధాలు అన్నింటినీ ప్రభుత్వమే దగ్గరుండి సప్లై చేయనుంది. ముఖ్యంగా రైతులు ఎక్కువ ఇబ్బందులు పడేది విత్తనాలు, ఎరువులు, ఔషధాల సమస్యలతోనే. అయితే వీటిని ప్రభుత్వం ఇవ్వడం నిజంగా శుభ పరిణామమే. జనవరి నుంచి వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చర్యలు చేపడుతున్నారు. అలాగే ఈ షాపులో kiosk అనే విధానాన్ని ప్రవేశపెడతారు. ఈ విధానం ద్వారా రైతు ఏదైనా ఒక పదార్ధం పేరు చెబితే ఔషధం ఎంతవరకు చల్లాలి, ఎంత మోతాదులో చేయాలి ఎప్పుడు చేయాలి అనే వివరాలను పొందుపరుస్తారు. నకిలీ విత్తనాలు తగ్గించి నాణ్యమైన సేవలు అందించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల రైతులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు.