ఏపీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు జగన్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు వాటిలో పోలవరం ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు పనులు ఆయన మరణానంతరం నత్తనడకన సాగాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అవినీతి మయం చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. పోలవరం కమిషన్లు కాంట్రాక్టర్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించింది అదే క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ పిలిచారు. అలాగే పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో రివర్స్ టెండరింగ్ సత్ఫలితాలు ఇవ్వడంతో మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా ప్రారంభమయ్యాయి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఇ అనిల్ కుమార్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవనాడి అని వైఎస్ ఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు తాగు సాగు నీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటారని ఆయన వెల్లడించారు.
