తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు నాని వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రక్రియ ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డిని కేసినేని నాని అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకొన్ననిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నారు. అయితే సాధారణంగా జగన్ ముఖ్యమంత్రి కనీసం మూడు నెలలు కాకముందే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలంతా ఆయనపై విమర్శలు గుప్పించారు. కనీసం ఏ ఒక్కటంటే ఒక్క పథకం మీద కూడా ప్రభుత్వాన్ని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నాయకులు అభినందించిన దాఖలాలు లేవు. అయితే అందువల్ల వస్తున్న సత్ఫలితాలను ప్రస్తావించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆయన జగన్ పాలనకు ఆకర్షితులయ్యారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. పుట్టిందా త్వరలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వైసీపీ లోకి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసినేని నాని కూడా వైసీపీ లోకి వస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా నాని చూపు వైసీపీ వైపు ఉందా అన్నట్టుగా ఉన్నాయి.
