సైరా మూవీ రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి సతీసమేతంగా వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. చిరుకు స్వయంగా వైయస్ జగన్ దంపతులు స్వాగతం పలికి…శాలువాతో సత్కరించారు. లంచ్ సందర్భంగా చిరు, జగన్‌ల మధ్య సినీ ఇండస్ట్రీ గురించి, నంది అవార్డుల గురించి చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిరు సైరా కలెక్షన్లు పెంచుకునేందుకే జగన్‌తో భేటీ అయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ పెద్దగా విమర్శలు చేయలేదు. అయితే చిరు సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం తన గురించి తాను బిల్డప్ ఇచ్చుకోబోయి.. పరోక్షంగా తన అన్నపైనే సెటైర్లు వేశాడని సమాచారం.. విశాఖలో లాంగ్ మార్చ్ సక్సెస్ అయిందని భావించిన పవన్ కల్యాణ్ రీసెంట్‌గా పార్టీ సమావేశంలో తనకు తాను గొప్పలు చెప్పుకున్నాడంట. సినిమాల్లో స్టార్‌డమ్ వదులుకుని ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చి..తాను అందరిచేత నానా మాటలు పడుతున్నానని చెప్పుకున్నాడంట. అదే తాను సినిమాల్లో ఉండి..నమస్తే బాబుగారు..నమస్తే జగన్ గారు అంటూ రాజకీయ నాయకులతో క్లోజ్‌గా తిరిగి ఉంటే..తన సినిమాలకు కూడా బెనిఫిట్ అయ్యేదని పవన్ చెప్పుకొచ్చాడు..అసలు సినిమాల్లో స్టార్ హీరోలంతా సీఎంలతో రాసుకుని పూసుకుని తిరగడం వెనుక కలెక్షన్లు పెంచుకునే ఉపాయమే..అని పవన్ వ్యాఖ్యానించాడంట. కాగా పవన్ సెటైర్లు ఇన్‌డైరెక్ట్‌గా తన అన్న చిరుకే తగులుతున్నాయి. సైరా మూవీ ప్రమోషన్ కోసమే..వెంకయ్యనాయకుడు, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, ఏపీ సీఎం జగన్‌లను కలిసిన సంగతి తెలిసిందే. వెంకయ్య, తమిళ సై అయితే ఏకంగా సిన్మా చూసి చిరును ఓ రేంజ్‌లో పొగిడేశారు. అందుకే చిరు జగన్‌ను కూడా కలిసి సిన్మా చూడమని అడిగాడు..అయితే జగన్ మాత్రం లంచ్ పెట్టి..చిరును పంపించేశాడు. మొత్తంగా పవన్ తనకు తాను బిల్డప్ ఇచ్చుకోబోయి..తన అన్న చిరుపైనే సెటైర్లు వేశాడని తెలుస్తోంది..మొత్తంగా చిరు, జగన్‌ల భేటీపై ఇన్‌డైరెక్ట్‌గా పవన్ వేసిన సెటైర్లు ఇప్పుడు ఏపీ సినీ, రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
