Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు షాక్..బీజేపీలోకి మాజీ మంత్రి…ముహూర్తం ఖరారు..!

చంద్రబాబుకు షాక్..బీజేపీలోకి మాజీ మంత్రి…ముహూర్తం ఖరారు..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో పదిరోజుల్లో గట్టి షాక్ తగలనుంది. విశాఖ జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు..మరో పది రోజుల్లో బీజేపీలో చేరడం ఖాయం అని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ పెద్దలతో గంటా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచే గంటా పార్టీ మారుతాడంటూ వార్తలు వచ్చాయి. అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో ముందే గుర్తించి..ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరి టికెట్ సంపాదించి గెలిచి మంత్రి పదవి చేపట్టడం గంటా స్టైల్. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు గంటా సిద్ధమైనా ఎందుకో వర్కవుట్ కాలేదు. అయితే టీడీపీ ఘోర పరాజయం తర్వాత గంటా..వైసీపీ లేదా బీజేపీలో చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఇటు విజయసాయిరెడ్డితో అటు బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌తో గంటా టచ్‌లో ఉన్నాడు. అయితే గంటా చేరికపై వైసీపీలో వ్యతిరేకత ఉంది. అంతే కాదు..వైసీపీలో చేరాలంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న కండీషన్ వల్ల గంటా వెనక్కి తగ్గినట్లు సమాచారం. అంతే కాకుండా సీఎం జగన్ సైతం గంటా చేరికపై సముఖంగా లేనట్లు సమాచారం. దీంతో బీజేపీ పెద్దలతో గంటా పార్టీ మార్పుపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట రాంమాధవ్‌ను కలిసిన గంటా..తన భవిష్యత్తుపై మాత్రమే కాకుండా వ్యక్తిగత డిమాండ్లపై చర్చ జరిపినట్లు తెలుస్తోంది. తాజాగా గంటా చేరిక వ్యవహారంపై ఏపీ బీజేపీ నాయకులు చర్చిస్తున్నట్లు టాక్. నవంబర్ 10 లేదా 11 న ఏపీకి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా రానున్నాడు. ఆయనతో గంటా చేరిక వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు చర్చించే అవకాశం ఉంది. నడ్డా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో వారం పదిరోజుల్లో ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో గంటా కాషాయం కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు వైజాగ్‌‌లో పవన్ కల్యాణ్ లాంగ్‌మార్చ్‌కు హాజరు‌కమ్మని మాజీమంత్రులైన అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, గంటాలకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినా..గంటా ఖాతరు చేయలేదు…పవన్ లాంగ్‌మార్చ్‌‌కు అయ్యన్న, అచ్చెంలు మాత్రమే అటెండ్ అయ్యారు..కాని గంటా రాలేదు. దీంతో గంటా పార్టీ మారే పనిలో బిజీగా ఉన్నాడని..అందుకే స్వయంగా చంద్రబాబు చెప్పినా పట్టించుకోలేదని..విశాఖ టీడీపీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా గంటా బీజేపీలో చేరుతున్నాడంటూ వస్తున్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. మరి గంటా బీజేపీలో చేరుతాడా లేదా అన్నది తెలియాలంటే..మరో వారం, పదిరోజులు ఆగాల్సిందే..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat