ఏపీలో ఇసుక కొరత అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరతపై నారావారిపుత్రరత్నం లోకేష్ నాలుగుగంటల నిరాహారదీక్ష చేయగా..పవన్ కల్యాణ్ వైజాగ్‌లో లాంగ్ మార్చ్ పేరుతో రెండున్నర కిలో మీటర్ల షార్ట్ మార్చ్ చేశాడు. ఇప్పుడు బాబుగారు కూడా రంగంలోకి దిగాడు..ఈ నెల 14 న విజయవాడలో 12 గంటల ఇసుక దీక్షకు రెడీ అయ్యాడు. అయితే పవన్ లాంగ్ మార్చ్‌కు చంద్రబాబు తన పార్టీ నేతలైన అచ్చెన్నాయుడు, అయ్యనపాత్రుడిని పంపించాడు. ఇప్పుడు తన దీక్షలో పాల్గొనాల్సిందిగా పవన్‌ను చంద్రబాబు కోరాడు. ఈ మేరకు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యను ఇవాళ పవన్‌ని కలిసి చంద్రబాబు రాసిన లేఖను అందించారు. ఆ లేఖలో అధికార పార్టీ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించిన చంద్రబాబు..తాను చేస్తున్న దీక్షలో పాల్గొనాల్సిందిగా పవన్‌ను కోరాడు. అయితే పవన్ మాత్రం తాను డైరెక్ట్‌గా వస్తే దత్తపుత్రుడు అని విమర్శలు వస్తాయని భయపడ్డాడో ఏమో కానీ..బాబు దీక్షకు తన పార్టీ నుంచి ముగ్గురు నేతలను పంపిస్తానని చెప్పినట్లు సమాచారం. పార్టనర్లు ఇలా ఒకరి దీక్షలకు మరొకరు మద్దతు ఇచ్చుకుంటున్న తీరును చూస్తే బాబుగారికి దత్తపుత్రుడు, పార్టనర్లు అంటూ పవన్‌పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు సహేతుకమే అనిపించడంలో అతిశయోక్తి లేదు. మొన్నటిదాకా రహస్య పొత్తులు కొనసాగించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రభుత్వంపై ముప్పేటా దాడి చేయడానికి ఇప్పుడు ముసుగులు తీసేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా పార్టనర్లు అని ముద్రపడ్డ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇలా ఒకరి దీక్షలకు మరొకరు మద్దతు ఇచ్చుకుంటున్న వైనం హాట్‌టాపిక్‌గా మారింది.
