ముమ్మిడివరం తూర్పు గోదావరి జిల్లా మత్స్యకారుల ప్రాంతం అయిన కొనమాన పల్లె లో మత్స కారుల దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఐదారు సంవత్సరాలుగా మత్స్యకారులు తమ కష్టాలను గత ప్రభుత్వంతో విన్నవించుకున్నా టీడీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఖాతరు చేయలేదని ఆయన పేర్కొన్నారు.జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్రలో మత్స్యకారుల కష్టాలను ఆయన ప్రత్యక్షం గా చూశానని వారికి చదువుకోడానికి వసతులు, త్రాగడానికి నీరు ఉండటానికి వసతి వంటి సదుపాయలుకుడా లేవని అన్నారు. ఆంధ్రలో 974 తీర ప్రాంతం ఉన్నా మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలసపోవడం బాధాకరమని వాపోయారు. పాదయాత్రలో అని గంగపుతులకు ఆయన ఇచ్చిన భరోసాను మరొక్కసారి గుర్తు చేసుకున్నారు.డీసీల్ పై మత్స్యకారులకు ఇస్తున్న 6.03రూ రాయితీని 9రూ కు పెంచామని.వేట నిషేధ కాలంలో ఇస్తున్న ఆర్ధిక సాయంను 6వేలు నుంచి 9వేలుకు పెంచామని.అధికారంలోకి వచ్చిన 5 నెలలలోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నానని తెల్పుతూ మత్స్యకారుల జీవితాలను మార్చడానికి వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.
