డిసెంబర్ 21.. వైయస్ అభిమానులకు పండుగ రోజు. ఆ రోజు ఏపీ ముఖ్యమంత్రి, జననేత జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే. జననేత జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిపేందుకు వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నాయి. . కాగా జననేత జన్మదిన వేడుకలకు రాజధాని విజయవాడ నగరం ముస్తాబు అవుతోంది. సిమ్స్ కాలేజీ అధినేత బి. భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో జననేత జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే సంబురాలు అంబురాన్ని తాకేలా జరుగనున్నాయి. ఇప్పటికే నగరమంతటా సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బి. భరత్‌రెడ్డి, ఆయన సతీమణి డా. బి. శివశిరీష పేర్లతో హోర్డింగ్‌లు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. విజయవాడ నగరంలో ప్రధానకూడళ్లలో, కృష్ణా బ్యారేజీ, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జననేత జగన్‌మెహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చరిత్రలోనే కనివినీ ఎరుగని విధంగా అంగరంగవైభవంగా జరిపేందుకు సిమ్స్ భరత్ రెడ్డి దగ్గరుండి భారీగా ఏర్పాట్లు చేయిస్తున్నారు. దీంతో రాజధానిలో వారం రోజులకు ముందే జన్మదినోత్సవ వేడుకల సంబురం మొదలైంది.
