Home / ANDHRAPRADESH / బ్రేకింగ్..మెడాల్ మెడికల్ స్కామ్‌లో లోకేష్‌కు మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు..?

బ్రేకింగ్..మెడాల్ మెడికల్ స్కామ్‌లో లోకేష్‌కు మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు..?

చంద్రబాబు హయాంలో వైద్యారోగ్య శాఖలో జరిగిన వందల కోట్ల అవీనితి బాగోతం బయటపడింది. టీడీపీ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు రక్తపరీక్షలు చేసే కాంట్రాక్టును మెడాల్ సంస్థకు చంద్రబాబు కట్టబెట్టాడు. బాబు, లోకేష్‌ల అండ చూసుకుని మెడాల్ సంస్థ చెలరేగిపోయింది. అపోలో ఆసుపత్రిలో 50 రూపాయలకు చేసే రక్తపరీక్షకు ఏకంగా 230 రూపాయలు బిల్లు ప్రభుత్వం నుంచి కొట్టేసింది. అలాగే 75 రూపాయలకు చేసే హెచ్‌ఐవీ టెస్ట్‌కు కూడా 230 రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి వసూలు చేసింది. అంతే కాదు ఒక్క తిరుపతి రుయా ఆసుపత్రిలోనే ఈ మెడాల్ సంస్థ ఏకంగా రూ. 45 కోట్ల స్కామ్‌కు పాల్పడింది. ఆసుపత్రుల్లో పరీక్షలకు అవసరమైన యంత్రాలను కొనుగోలు చేస్తే 120 కోట్లు ఖర్చు అయ్యేవి. కాని మెడాల్ సంస్థ యంత్రాలను కొనుగోలు చేయకుండా ప్రతి సంవత్సరం కేవలం రక్త పరీక్షలకే ప్రభుత్వం నుంచి రూ. 120 కోట్లు కొట్టేసిందని సమాచారం. అలా చంద్రబాబు, లోకేష్‌లు మెడాల్ సంస్థకు ఐదేళ్లలో వందల కోట్లు దోచిపెట్టి ప్రతిగా భారీగా కమీషన్లు పొందారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెడాల్ మెడికల్ స్కామ్‌‌ బాగోతాన్ని అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలో మెడాల్ సంస్థ పేరుతో వందల కోట్ల అవినీతి జరిగిందని…ప్రతిగా లోకేష్‌కు రూ. 250 కోట్ల ముడుపులు అందాయని ఆరోపించారు. ఈ మెడికల్ స్కామ్‌పై వెంటనే లోతుగా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా చంద్రబాబు హయాంలో డిప్యుటేషన్‌పై వచ్చి వైద్యారోగ్య శాఖలో పని చేసిన ఐఆర్ఎస్ అధికారి, మాజీమంత్రి యనమల అల్లుడు సీహెచ్ వెంకట గోపీనాథ్ ఇటీవల తనను సర్వీస్ ఇంకా ఉన్నా…రిలీవ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో జగన్ సర్కార్‌ ఆయన్ని సెంట్రల్ డెరెక్ట్ ట్యాక్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న కాలంలో గోపీనాథ్‌‌పై ఆనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా మెడాల్ మెడికల్ స్కామ్ ఆయన హయాంలోనే జరిగింది. అందుకే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవినీతి బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో ఇంకా డిప్యుటేషన్‌ గడువు ముగియకున్నా..రద్దు చేసుకుని మళ్లీ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. అయితే మెడాల్ మెడికల్ స్కామ్‌లో గోపీనాథ్‌ను మాతృ సంస్థ నుంచి విచారణకు పిలుస్తారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి వుంది. మొత్తంగా బాబు హయాంలో జరిగిన ఈ మెడాల్ మెడికల్ స్కామ్‌లో లోకేష్‌కు రూ. 250 కోట్లు ముడుపులు అందాయన్న ఆరోపణలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి ఈ మెడికల్ స్కామ్‌ మున్ముందు ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat