ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, వైయస్ అభిమానులు ఆయన బర్త్‌డే వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. ఇవాళ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విటర్ ద్వారా సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను
— Lokesh Nara (@naralokesh) December 21, 2019