వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ రిపోర్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. బోస్టన్ కమిటీ నివేదక తప్పుల తడక అని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఏది చెబితే కమిటీ అది రాసి ఇచ్చిందని బాబు ఆరోపించారు. జీఎన్‌రావు కమిటీ కూడా అజయ్ కల్లాం ఇచ్చిన రిపోర్ట్‌నే నివేదికగా రాసిచ్చిందని బాబు వెల్లడించారు. గతంలో ఇలాంటి కన్సెల్టెంట్ కమిటీలు తప్పుడు నివేదికలు ఇచ్చాయని బాబు ఫైర్ అయ్యారు. దీనిపై విజయసాయి రెడ్డి “బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపును అప్రతిష్ఠ చేసే కుట్రకు చంద్రబాబు తెగబడ్డాడు. బిసిజి వికీపీడియా ప్రొఫైల్ ను ఎడిట్ చేయించి సిఎం జగన్ గారికి 50% వాటాలున్నాయని రాయించాడు. 12 సార్లు ఇలా సమాచారాన్ని మార్చే ప్రయత్నం చేశారని హిందూ పత్రిక బయట పెట్టింది. పాతాళానికి జారిపోయావు బాబూ”! అని అన్నారు.
