అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బాబు మోడీని తిట్టారు.. తర్వాత కలిశారు, మళ్లీ తిట్టారు. సోనియాను తిట్టారు, మళ్లీ కలిశారు. హోదా కావాలన్నారు, హోదాతో ఏమొస్తుందన్నారు. ఇప్పుడు మండలి విషయంలోనూ బాబుది ద్వంద్వ వైఖరే. బాబుకు ఏ విషయంలోనూ స్థిరత్వం ఉండదు అని అన్నారు. అంతేకాకుండా గతంలో ఎన్టీఆర్ మండలిని రద్దుచేయడం పై ఈనాడు పత్రికలో స్వాగతిస్తూ ఓ కథనం రాశారు. మండలిని రద్దు చేయడం తప్పే కాదంటూ అప్పట్లో ఈనాడు ప్రచురించింది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటున్నప్పుడు ఈనాడు, చంద్రజ్యోతి, ఎల్లో మీడియా ప్రశ్నించలేదు అని అన్నారు.