Home / ANDHRAPRADESH / కియాపై దుష్ప్రచారం..విజయసాయిరెడ్డి ఫైర్..!

కియాపై దుష్ప్రచారం..విజయసాయిరెడ్డి ఫైర్..!

కియామోటార్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. నిజానికి ప్రధాని మోదీ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఏపీకి కియామోటార్స్ వచ్చింది. కాని ప్రపంచంలో ఎవరు ఏది సాధించినా అది నావల్లే… అని బిల్డప్ ఇచ్చుకునే చంద్రబాబు కియా పరిశ్రమ ఏర్పాటు ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కాగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కియామోటార్స్ ఫస్ట్ కారు రిలీజ్ అయిందంటూ చంద్రబాబు ఓ కారుకు నల్లగుడ్డలు కప్పి మరీ.. అదిగో నావల్లే కియా నుంచి ఫస్ట్ కారు రిలీజ్ అయిందంటూ డబ్బాకొట్టుకున్నారు. అయితే ఈ బ్లాక్‌క్లాత్ బాగోతం బట్టబయలై అది కియా కారు కాదని తేలిపోవడంతో పరువు పోగొట్టుకున్నారు. ఇక ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి కియామోటార్స్ ప్రారంభోత్సవంలో పాల్లొని తొలి కారును లాంఛ్ చేశారు. ఇదీ అసలు వాస్తవం..ఇక గత రెండు నెలలుగా మూడు రాజధానులపై అడ్డగోలుగా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, ఆయన అనుకుల మీడియా ఛానళ్లు ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రాజధానులపై జరుగుతున్న రగడ నేపథ్యంలో కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ దుష్ప్రచారం మొదలుపెట్టాయి.

కాగా కియామోటార్స్‌‌ తరలింపు వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కియామోటార్స్ అనేది మొట్టమొదటగా తమిళనాడుకు తరలిపోకుండా జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయించిన ఘనత ప్రధాని మోదీగారికి దక్కుతుందని విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీకి కియామోటార్స్ రావడంలో చంద్రబాబునాయుడు కృషి ఏ మాత్రం లేదని తేల్చిచెప్పారు. అసలు కియా మోటార్స్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ఎటువంటి సహాయసహకారాలు అందించలేదని ఆరోపించారు. పైగా ఇప్పుడు కియామోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ…దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడే బ్రతుకే..ఇంత…ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. కియా మోటార్స్ విషయంలో కంపెనీ ఏమైనా మౌలిక వసతులు కావాలని అడుగుతుందో అన్నింటిని ఏపీ ప్రభుత్వం ఇస్తుందని..కియా మోటార్స్ ఇంకా ఏపీలో విస్తరించే అవకాశం కూడా ఉందని విజయసాయిరెడ్డి స్పష్ట చేశారు. గల్లా జయదేవ్‌కు, రామ్మోహస్ నాయుడికి, చంద్రబాబుకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు కాని..వారు పార్లమెంట్‌లో, బయట కియామోటార్స్ తరలిపోతుందని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మద్దని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. మొత్తంగా కియామోటార్స్ తరలిపోతుందంటూ బాబు బ్యాచ్ చేయిస్తున్న పెయిడ్ వార్తలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు.

కాగా కియామోటార్స్ తరలింపు వార్తల వెనుక ఎవరు ఉన్న విషయంపై వార్తలు వస్తున్నాయి. తొలుత ఈ వార్తను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రాయించారని తెలుస్తోంది. తమ పరిశ్రమను తమిళనాడుకు తరలిపోతుందంటూ… కియా వాళ్ళు మీకు చెప్పారా అని ఈ వార్త రాసిన ఆదిత్య , సుదర్శన్ , అదితి అనే జర్నలిస్ట్‌లను అడిగితే .. మాకేమీ తెలియదు మమ్మల్ని ఏమీ అడగవద్దు అంటూ వారు దాటేసినట్లు సమాచారం. మొత్తంగా చంద్రబాబు అనుకుల మీడియా ఎంతగా డప్పుకొట్టినా ప్రజలు నమ్మడం లేదని గ్రహించిన చంద్రబాబు..జాతి మీడియాను వదలి జాతీయ మీడియా..ఫేమస్ ఇంగ్లీష్ వెబ్‌సైట్లలో ముందు రాయించి..వాటిపై తన అనుకుల మీడియా ఛానళ్లలో పొద్దస్తమానం ప్రసారం అయ్యేలా చూడమని ఎల్లోమీడియాధిపతులకు ఆర్డరేశారంట…మొత్తంగా కియాపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైనస్టైల్లో చెక్ పెట్టారు. కాగా కియాపై చంద్రబాబు చేయిస్తున్న దుష్ప్రచారంపై నెట్‌జన్లు మండిపడుతున్నారు. ఏ క్యా కియా చంద్రబాబు..నీ బతుకే ఇంత…అంటూ తీవ్ర పదజాలంతో ట్వీట్లు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat