ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం ముచ్చెమటలు పడుతున్నాయి. అధికారంలో ఉన్నంతకాలం అతడిని తలదన్నే వాళ్ళే లేరని, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరించారు. అంతేకాకుండా బాబు అండతో ఎందరో చలామణి అవుతున్నారు. 40ఏళ్ల రాజకీయం అనేది పక్కనపెడితే గత ఐదు సంవత్సరాల్లోనే చంద్రబాబు అండ్ టీమ్ ఎన్ని అక్రమాలకూ, అన్యాయాలకు పాల్పడిందో అందరికి తెలిసిన విషయమే. తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను మభ్యపెట్టి చివరికి గెలిచాకా చేతులెత్తేశారు. తన అధికారం కేవలం సొంతం వాళ్ళకే ఉపయోగపడింది తప్పా..ప్రజలకు ఒక్క రూపాయి కూడా పెట్టింది లేదనే చెప్పాలి. ఎ
న్ని అక్రమాలు అంటే తన దగ్గర పనిచేసే పీఏ ఇంట్లో సోదాలు చేసారంటే అర్ధం చేసుకోవచ్చు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది. బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే పది లక్షల కోట్లయినా దొరుకుతాయి. బాబు నెట్ వర్క్ ను చూసి ముంబాయి కార్పోరేట్ సంస్థలన్నీ బిత్తర పోయాయట. ఇప్పడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమే” అని ఆయన ఎద్దేవా చేసారు. ప్రస్తుతం జరుగుతున్న ఐటీ దాడులు చూసి చంద్రబాబు అండ్ కో లగెత్తుకొని వచ్చారు. ఒక్కొకటిగా ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. ఏ టైమ్ లో నైనా సరే బాబుకు గండం తప్పదని చెప్పాలి.