ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సీఎం సందర్శించనున్నారు. ఉదయం తాడేపల్లి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న జగన్ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ వద్దకు చేరుకుని పరిశీలిస్తారు. తర్వాత మొదటి టన్నెల్‌ను పరిశీలిస్తారు. ఆపై 11.30 గంటలకు అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రోడ్డుమార్గం ద్వారా హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి గంటలకు తాడేపల్లికి జగన్ బయలుదేరనున్నారు.
