టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మాజీమంత్రి లోకేష్ ఇద్దరూ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు ఏపీమంత్రి పినిపె విశ్వరూప్.. గతంలో అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అక్కడ భారీ అవినీతి చేసి దొరికిపోయారని తప్పు చేసిన వారిపై చర్యలు ఎట్టిపరిస్థితుల్లో తప్పవన్నారు. అమరావతిలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై దాడి జరగడం చాలా బాధాకరమని.. ఈఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళితులంటే చంద్రబాబుకు మొదటినుంచీ చిన్నచూపన్నారు.. చంద్రబాబు నిఖార్సయిన రాజకీయం చేయడం చేతకాక ఆడవాళ్లను అడ్డంపెట్టుకుని శిఖండి రాజకీయాలకు పాల్పడుతున్నారని, మీరు చేసిన పాపాలు పండడతో కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
