Home / ANDHRAPRADESH / ఆ ముగ్గురు టీడీపీ నేతలపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!

ఆ ముగ్గురు టీడీపీ నేతలపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబును అండమాన్‌ జైలుకు పంపాలన్నదే స్వర్గీయ ఎన్టీఆర్ కోరిక అంటూ వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ నేతృత్వంలో పది మంది అధికారులతో కూడిన సిట్ కమీషన్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్, సీఆర్డీఏలో జరిగిన అవకతవకలు, సరిహద్దుల మార్పులు, బినామీ లావాదేవీలపై సిట్ ఫోకస్ పెట్టనుంది. ఈ క్రమంలో ఎవరినైనా సాక్షులుగా విచారించి, అరెస్ట్ చేసే విధంగా సిట్‌కు విస్తృత అధికారాలను కట్టబెట్టింది జగన్ సర్కార్. దీంతో బాబు బ్యాచ్‌లో ఆందోళన మొదలైంది. కాగా సిట్ ఏర్పాటుపై చంద్రబాబు మండిపడ్డారు. ఇది పూర్తిగా టీడీపీ నేతలపై సాధిస్తున్న కక్ష సాధింపు చర్యలని, మేం ఏ తప్పు చేయలేదని, ఎవరికి భయపడేది లేదంటూనే సిట్ ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. అయితే మీరు నిప్పు అయితే ఎందుకు భుజాలు తడుముకుంటారు అంటూ చంద్రబాబుకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

 

తాజాగా వైసీపీ నేత శ్రీమతి లక్ష్మీ పార్వతి సిట్ ఏర్పాటుపై స్పందించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ..గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని పడిపడి దోచుకున్నారని మండిపడ్డారు. విశాఖ భూములపై గత ప్రభుత్వం సిట్‌ వేసి చిన్న ఉద్యోగులను బలిచేశారని ఆమె ఆరోపించారు. కాని ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన సిట్‌ ద్వారా వాస్తవాలు వెల్లడవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా నాయుడు జైలుకి వెళ్లడం చూడాలని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తాను అధికారంలోకి వస్తే చంద్రబాబుని అండమాన్‌ జైలు పంపించాలని ఉందని ఎన్టీఆర్‌ అంటుండే వారు. ఆ రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నా’ అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఇప్పటికే బ్యాంకులకు రుణాల ఎగవేత, హవాలా, మనీలాండరింగ్ కేసుల్లో సుజనా, ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెంనాయుడు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అలాగే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో పాటు, వేలాది కోట్ల అక్రమ సొమ్మును షెల్ కంపెనీల పేరుతో హవాలా, మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించి..తిరిగి ఆ డబ్బును విదేశీ పెట్టుబడుల పేరుతో బినామీ కంపెనీల ద్వారా తన ‌ఖాతాల్లోకి మళ్లించుకున్న బాగోతంలో చంద్రబాబు కూడా పీకల్లోతు ముగినిపోయారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతలు జైలుకు వెళితే చూడాలని ఉంది..ముఖ్యంగా చంద్రబాబుని అండమాన్‌ జైలు పంపించాలన్నదే ఎన్టీఆర్ కోరిక అంటూ లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat