అధికారంలో ఉన్నంతసేపు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే చివరికి ఎవరు తీసిన గోతులో వారే పడతారు అని చంద్రబాబుకు ఈపాటికే బాగా అర్దమయి ఉంటుంది. అధికారం ఉందని అహంకారంతో ఏదైనా చేయొచ్చు అనుకుంటే అవతల వారికి కూడా టైమ్ వస్తుంది అని ఈరోజు రాష్ట్రం మొత్తం అర్దమైంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రత్యేక హోదా సమయంలో జగన్ ను విశాఖ విమానాశ్రయం నుండి రాకుండా అడ్డుకునేల చేసారు. అయితే ఆ పాపం ఊరకనే పోలేదని చెప్పాలి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ఏం చట్టం కింద నన్ను వెనక్కు పంపుతారని బట్టలు చించుకుంటున్నాడు. ప్రజల మధ్య విష బీజాలు నాటే వారిని వంద సెక్షన్ల కింద లోపలికి నెట్టొచ్చు. ఏడాది కిందట స్పెషల్ స్టేటస్ కోరే ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ గారిని ప్రజా ప్రతినిధులను ఏ చట్టం కింద ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపావు?” అని అన్నారు.
