Home / ANDHRAPRADESH / చంద్రబాబు నివాసంలో విందు రాజకీయం..టీడీపీలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్..!

చంద్రబాబు నివాసంలో విందు రాజకీయం..టీడీపీలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్..!

విందు రాజకీయాలు నడపడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిన రాజకీయ నాయకుడు దేశంలో ఉండరు. బాబుగారు కుటుంబ కార్యక్రమంలో కాకుండా… బయటవ్యక్తులకు ఏదైనా విందు ఇచ్చారంటే..అందులో ఏదో కుటిల రాజకీయం ఉంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కునే ముందు టీడీపీ ఎమ్మెల్యేలతో వైస్రాయి హోటల్‌లో పలుమార్లు విందు రాజకీయం నడిపినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆఖరకు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని జగన్‌ను జైలుకు పంపడానికి కూడా కాంగ్రెస్ నేతలతో చంద్రబాబు విందు రాజకీయం నెరిపినట్లు విమర్శలు వచ్చాయి. ఇక నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కూడా ఏకంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు అధికారికంగా విందు ఇచ్చి మరీ వారిని విలువైన కానుకలతో సత్కరించారు..అయితే బాబుగారికి 18 స్టేల వెనుక ఈ విందు మతలబు ఉందో లేదో తెలియదు కాని..విందు రాజకీయాన్ని మాత్రం బాబుగారు మహా రంజుగా నడిపిస్తారు. అంతెందుకు మొన్నటికి మొన్న దీపావళికి ముందు బాబుగారు జాతీయ మీడియా ప్రతినిధులకు హైదరాబాద్‌లో మంచి కాక్‌టెయిల్ పార్టీ ఇచ్చి..భారీ కానుకలతో వారిని సంతృప్తి పరిచి..టీడీపీకి జాతీయ మంచి కవరేజ్ ఇవ్వమని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక తనకు, ముఖ్యంగా తన పుత్రరత్నం లోకేష్‌కు జాకీలు వేసి లేపే జాతి మీడియా సారీ..ఎల్లోమీడియాకు బాబుగారు రెగ్యులర్‌గా లంచ్‌లు, డిన్నర్‌లు, కాక్‌టెయిల్ పార్టీలు ఇస్తూనే ఉంటారు..పచ్చమీడియా జర్నలిస్టులకు భారీగా కవర్లు కూడా దండిగా ముట్టజెబుతారు..అమరావతిలో ఎల్లోమీడియా జర్నలిస్టులకు ఏకంగా లక్షలాది రూపాయల విలువైన ఫ్లాట్లను అప్పనంగా కట్టబెట్టారని విమర్శలు ఉన్నాయి.

 

అయితే తాజాగా హైదరాబాద్‌లోని తన నివాసంలో టీడీపీ నేతల రాజకీయ వారసులతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు విందు సమావేశం నిర్వహించారు. ఈ విందు భేటీకి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కుటుంబాలకు చెందిన వారసుల్లో ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కొందరిని ఎంపిక చేసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారసుల భార్య/భర్తలను సైతం పిలిచారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగింది. చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలు సైతం కొద్దిసేపు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పరిటాల శ్రీరాం, టీజీ భరత్, మాగంటి రాంజీ దంపతులు, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు కుమారులు, కోడళ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

తన నాయకత్వాన్ని  సీనియర్లు వ్యతిరేకిస్తుండడంతోపాటు, క్యాడర్ కూడా క్రమేణా నమ్మకం కోల్పోతుండడంతో… పార్టీపై తన పట్టును నిరూపించుకోవాలన్న ఆలోచనతో పాటు రాజకీయంగానూ తనపై పార్టీ నేతల్లో నమ్మకం కలిగించే ఉద్దేశంతో నారా లోకేష్‌ ఈ విందు రాజకీయం మొదలుపెట్టినట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. అంతేకాదు మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఉత్తరాంధ్రకు చెందిన రామ్మోహన్ నాయకుడు, గౌతు శిరీష, అయ్యన్నపాత్రుడి ఫ్యామిలీ, రాయలసీమకు చెందిన భూమా అఖిలప్రియ, టీజీ భరత్ వంటి యువనేతలతో భేటీ అయి…తెలుగుదేశం పార్టీలో కొనసాగితే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని లోకేష్ నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్టీ నుంచి వలసలు పోకుండా నిలువరించడంతో పాటు, లోకేష్‌పై నమ్మకం నిలబెట్టడం కోసమే చంద్రబాబు కోడలు బ్రాహ్మణిని రంగంలోకి దించి ఇలా రాజకీయ వారసులతో విందు రాజకీయం నడిపించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.దీంతో అమ్మ చంద్రబాబు లోకేష్‌ను నిలబెట్టడం కోసం విందు రాజకీయం చేశావా…అంటూ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు.