Home / ANDHRAPRADESH / త్వరలో టీడీపీ పగ్గాలు బ్రాహ్మణి చేతికి.. ఇక లోకేష్ పెళ్లాం చాటు మొగుడేనా..!

త్వరలో టీడీపీ పగ్గాలు బ్రాహ్మణి చేతికి.. ఇక లోకేష్ పెళ్లాం చాటు మొగుడేనా..!

టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ సతీమణి, నందమూరి బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాను, ఎల్లోమీడియా ఎంత జాకీలు పెట్టి లేపాలని చూసినా లోకేష్ మొద్దబ్బాయి లాగానే ఉండడం.. చంద్రబాబు నిరాశ పరుస్తోంది. ఒక పక్క యువనేతగా జగన్ రోజు రోజుకీ శక్తివంతంగా మారుతుంటే..లోకేష్ మాత్రం తన తన అసమర్థతతో రోజు రోజుకీ పార్టీ శ్రేణుల్లో నమ్మకం కలిగించలేకపోవడం చంద్రబాబును కుంగదీస్తోంది.. దీంతో తన రాజకీయ వారసత్వంపై బాబుకు దిగులు పట్టుకుంది. అందుకే రాజకీయాల నుంచి రిటైర్ మనవడితో ఆడుకోవాల్సిన చంద్రబాబు ఇంకా రాజకీయ రణరంగంలో జగన్‌తో పోటీపడుతున్నాడు. అయితే వయసురీత్యా చంద్రబాబు ఇంకో నాలుగైదేళ్లు కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండగలుగుతారు..ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగాలన్నా ఆరోగ్యం సహకరిస్తుందనే గ్యారంటీ లేదు..ఇప్పటికే అధికారం కోల్పోయి కుంగిపోయిన చంద్రబాబును శారీరక సమస్యలు పెద్దగా లేకున్నా…మానసిక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అందుకే గతంలో ఎన్నడూ లేనంతగా ఆయన ముఖంలో అసహనం, కోపం, ఒక విధమైన నిస్సహాయత కనిపిస్తుంది. ముఖ్యంగా తన రాజకీయ వారసుడి విషయంలో చంద్రబాబు కలత చెందుతున్నారు.

స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, నందమూరి కుటుంబం నుంచి అడ్డంకులు తొలగించుకుని, ఏక చక్రాధిపత్యంగా పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్న చంద్రబాబు ఇక తన కుమారుడి విషయంలో రోజు రోజుకీ నమ్మకం కోల్పోతున్నారు. గతంతో పోలిస్తే లోకేష్‌‌ ఇప్పుడు ఫర్వాలేదనిపిస్తున్నా..అగ్రెసివ్‌గా కనిపిస్తున్నా…పప్పు ఇమేజ్ ఆయనకు గుదిబండగా మారింది. అందుకే లోకేష్ వీరావేశంతో స్పందించినా…సోషల్ మీడియాలో కామెడీగా ట్రోల్ అవుతుంది. మరోవైపు పట్టుబట్టి అన్ని లెక్కలు వేసుకుని, తన సామాజికవర్గం బలంగా ఉన్న రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో లోకేష్‌ను పోటీ చేయించినా ఓడిపోవడం చంద్రబాబు‌ జీర్ణించుకోలేకపోతున్నాడు. భవిష్యత్తులో తనలా జగన్‌తో పోటీ పడే సత్తా తన కొడుక్కి లేదని చంద్రబాబుకు కూడా అర్థమైంది. మరోవైపు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుని నందమూరి వారసులకు అప్పగించాలని, అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీని అప్పగించాలని పార్టీ క్యాడర్ నుంచి, నందమూరి అభిమానుల నుంచి వత్తిడి ఎక్కువైంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీని అప్పగించడం చంద్రబాబుకు సుతరామూ ఇష్టం లేదంట..జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అయితేనే తట్టుకోలేమని…అదీ పార్టీని అప్పగిస్తే..ఇక పార్టీపై తన కుటుంబ ఆధిపత్యం ఉండదని చంద్రబాబు భయపడుతున్నాడు. అందుకే మధ్యేమార్గంగా నారా బ్రాహ్మణిని రంగంలోకి దించుతున్నట్లు టీడీపీ శ్రేణుల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం. రాజకీయాల్లో బ్రాహ్మణి రాటుదేలిన తర్వాత పార్టీ పగ్గాలు బ్రాహ్మణికి అప్పగించే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య కుమార్తె కావడంతో నందమూరి అభిమానులు కూడా స్వాగతిస్తారని…మరోవైపు తన కోడలు కనుక పార్టీపై తన ఆధిపత్యం ఉంటుందని బాబు అనుకుంటున్నాడంట…మరోవైపు తన సొంత బాబాయి కూతురు, స్వయానా సోదరి అయిన బ్రాహ్మణికి టీడీపీని అప్పగిస్తే…జూనియర్ ఎన్టీఆర్‌ కూడా కామ్ అయిపోయా సిన్మాలకే పరిమితం అవుతాడని..ఇక రాజకీయాల్లోకి వచ్చి టీడీపీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉండదని చంద్రబాబు స్కెచ్ వేశాడంట..అందుకే ఈ మధ్య వరుసగా బ్రాహ్మణిని తన వెంట తిప్పుతున్నాడు.

అమరావతి ఆందోళనల్లో సంక్రాంతి పండుగ రోజు తన భార్యతో పాటు కోడలు బ్రాహ్మణిని కూడా పస్తులుంచి సెంటిమెంట్ పండించాడు. తాజాగా కోడలితో టీడీపీ యువనేతలతో విందు సమావేశం ఏర్పాటు చేయించాడు. చూడచక్కని రూపం, తెలుగు, ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడే బ్రాహ్మణి ఎవరినైనా ఆకట్టుకోగలరు. రాజకీయాల్లో కొద్దిరోజులు రాటుదేలితే మంచి నాయకురాలు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నాడంట…అందుకే కోడలిని రాజకీయాల్లో యాక్టివ్ చేస్తున్నాడంట…ఒక వేళ బ్రాహ్మణి తాను అనుకున్నట్లుగా పాలిటిక్స్‌లో దూసుకుపోతే ఆమెకు పార్టీని అప్పగించేసి నిశ్చితంగా మనవడితో ఆడుకోవచ్చని చంద్రబాబు అనుకుంటున్నాడంట…అలా కాకుండా బ్రాహ్మణి కూడా పాలిటిక్స్‌లో తన సమర్థతను చాటుకోకపోతే..వచ్చే ఎన్నికల వరకు ఇలాగే పోరాడి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్‌కు దొడ్డిదారిన సీఎం పదవి కట్టబెట్టచ్చని చంద్రబాబు ప్లాన్ వేశాడంట..మొత్తంగా రాజకీయాల్లో నారా బ్రాహ్మణి యాక్టివ్ అయితే ఇక లోకేష్ పెళ్లాం చాటు మొగుడుగానే మిగిలిపోతాడని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారంట..

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat