మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీచపు రాజకీయాలు ఎలా ఉంటాయో రాష్ట్రం మొత్తం మొన్న జరిగిన ఎన్నికల్లో చూసారు. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఏదోలా గెలిచేసారు. గెలిచిన తరువాత బాబుని నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచేశారు. రైతుల కడుపు కొట్టాడు. ఇంకా చెప్పాలంటే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డానికి ముఖ్య కారకులు అయ్యారు. ఇదేమిటని ప్రశ్నించినవారికి రాష్ట్రం అప్పుల్లో ఉంది మీకు ఏమీ చెయ్యలేను అని చేతులెత్తేశారు. దాంతో విసిగిపోయిన ప్రజలు, మహిళలు వారిని గట్టిగా ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టించాడు. దీంతో చంద్రబాబు కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అది తెలుసుకున్న బాబు ఓటమని బయంతో మళ్ళా ప్రజలకు డబ్బును రుచి చూపించాలని అనుకున్నాడు. ఈ మేరకు చాలా డబ్బులు పంచిపెట్టాడు. అవన్నీ తీసుకున్ని ప్రజలు జగన్ ని గెలిపించి సరైన బుద్ధి చెప్పారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేకపోతే మేం పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ. నీవల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో” అని అన్నారు.
