ఏపీలో ఎన్నికలు అంటే ఎట్టాఉంటాయో అందరికి తెలుసనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం దేశం తో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోరు ఎన్నో విద్వంశకాలకు తెరలేపుతాయి. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఇంకా ఎక్కువనే చెప్పాలి. అయితే ఈసారి దేనికీ తావులేకుండా చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఒకప్పుడు ఎన్ని చేసినా ఎన్నికల్లో కాస్తో కూస్తో డబ్బులు, మందు ఇలా అన్ని ఉండేవి. కాని ఈసారి అలా జరిగితే ఉపేక్షించేదే లేదని జగన్ తేల్చి చెప్పేసాడు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “సిఎం జగన్ గారు అత్యంత సాహసంతో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ప్రలోభాలను తిరస్కరించి అసాధారణ పరిణితిని ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రజానీకం తహతహలాడుతోంది. కమాన్ చంద్రబాబూ. స్వాగతిస్తావో, పలాయనం చిత్తగిస్తావో తేల్చుకోవాల్సింది నువ్వే” అని అన్నారు.
