మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ చేతుల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజల్ని మోసంచేసి గెలిచి ఆ తరువాత ఒక్కపని కూడా చేయకుండా అధికారాన్ని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారు. దాంతో ప్రజలు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఘోరంగా ఓడించారు. ఇక ఇప్పుడు స్థానికి సంస్థల ఎన్నికలు రానేవచ్చాయి. చంద్రబాబు చేసిన అన్యాయాలకు ఇక ఆ పార్టీ మళ్ళా కోలుకోవడం కష్టమే. అయితే ఎన్నికల పరంగా చంద్రబాబు అండ్ బ్యాచ్ కు ఇదే ఆఖరిపోరాటం అని చెప్పాలి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “చంద్రబాబు పచ్చ ముఠాకిది ఆఖరు పోరాటం. వైఎస్సార్ కాంగ్రెస్ సైనికులు అప్రమత్తంగా ఉండాలి. సిఎం జగన్ గారిపై బురద చల్లడానికి దేనికైనా తెగిస్తారు. ఎల్లో మీడియా గోతికాడి నక్కలాగా ఎదురు చూస్తోంది. తనే డబ్బు, మద్యం పంపిణీ చేయించి మన మీదకు నెట్టడానికి కుట్రలు పన్నుతాడు బాబు” అని అన్నారు.
