Home / ANDHRAPRADESH / మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలో దీక్షలు

మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలో దీక్షలు

మందడం, తాళ్ళాయిపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రక్కన ఆంధ్రప్రదేశ్ బహుజన సంక్షేమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణకు మద్దతుగా నిరుపేదలకు 50వేల ప్రక్కా గృహాలు మంజూరు చేసినందుకు మద్దతుగా మరియు ప్రజాప్రతినిధులపై దాడులు ఖండిస్తూ చేస్తున్న దీక్షలు శనివారం ఆరోరోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరానికి పెద్దఎత్తున దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వికేంద్రకరణకు మద్దతు తెలిపారు. వికేంద్రీకరణ జరిగితేనే బడుగు, బలహీన, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని పలువురు మాట్లాడుతూ అన్నారు. దళిత, బహుజనలు, ముస్లిం మరియు మైనార్టీ వర్గాల వారు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలపాలని కోరారు. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలపై కోర్టుకు వెళ్ళడం నిరుపేదలను అగ్రవర్ణాల ఆహంకరంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను అడ్డుకుంటూ కోర్టుకు వెళ్ళడం హేయమైన చర్య అంటూ బీసీ కులాల ఐక్య వేదిక కన్వీనర్ ఇంటూరి బాబ్జినంద అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సెంటు స్థలం కేటాయిస్తే ఓర్చుకోలేని వారు అమరావతి రాజధాని కావాలని ఏలా కోరుకుంటారని ప్రశ్నించారు. రాజధానిలో కొన్ని సామాజిక వార్గాల వారే ఉండాలనట్లు కొంతమంది ప్రవర్తిస్తున్నారని అది మంచి పద్దతి కాదు అని మండిపడ్డారు.

 

 

 

 

వెంటనే నిరుపేదలకు ఆ ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీల ఐక్యత వర్థిలాలి, పెద్దల రాజధాని వద్దు పేదల రాజధానే ముద్దు, బహుజనుల రాజధాని కావాలంటూ అని నినాదించారు. కేంద్రీకరణ వల్ల హైదరాబాద్ ని కోల్పోయి నష్టపోయామని మరలా ఇప్పుడు నష్టపోవడానికి సిద్ధంగా లేమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడమే మా ధ్వేయమని సంఘాల నేతలు తెలిపారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ వికేంద్రీకరణ చేయాలని కోరుకుంటుంటే మన రాష్ట్రంలో మాత్రం కొంతమంది స్వార్థం కోసం వికేంద్రీకరణ వద్దు అంటూ చెప్పడం వారి స్వార్థ బుద్ధులకు నిదర్శనం అని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక కో-కన్వీనర్ దేవళ్ళ వెంకట్, దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టే రాజు, నవ్యాంధ్ర ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాస్, అమరావతి రాజధాని ప్రాంత ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మల్లవరపు నాగయ్య, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యోనారాజు, దళిత నేత నూతక్కి జోషి, మాదిగ ఆర్థికాభివృద్ధి చైతన్య సమితి (MACS) వ్యవస్థాపక అధ్యక్షుడు బేతపూడి సాంబయ్య, మహిళ దళిత నాయకురాలు సుభాషిణి, మహిళ ఎంఆర్‌పీఎస్ నాయకురాలు ఎన్ చంద్రలీలా, దళిత మహిళ నేతలు మల్లవరపు సుధారాణి, సామ భవానీ, ముస్లిం మహిళ నాయకురాలు రహీమా, బి చంటి, సంకూర నాగలత, జువ్వనపూడి శైలజ, ఓదుల రత్నకుమారి, రాజధాని రైతుకూలీల సంఘం అధ్యక్షుడు కట్టెపోగు ఉదయ్ భాస్కర్ పెద్దఎత్తున మహిళలు, దళిత కార్యకర్తలు పెద్దఎత్తున పాల్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat