భారతదేశంలో అరకు ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ముఖ్యంగా చలికాలంలో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి రావాలంటే రైలు మరియు రోడ్ మార్గాలు ఉన్నాయి. కాని ఎక్కువగా రైలు మార్గం ఎంచుకుంటారు. ఎందుకంటే ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యలో గుహలు చూడముచ్చటగా ఉంటాయి. రోజులు గడిచేకొద్ది జనాలు పెరుపోవడంతో పర్యాటకుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం అరకు మధ్య నడిచే రైలుకు మరో అయిదు విస్టాడోమ్ కోచ్‌లను అదనంగా ఏర్పాటు చేయాలని ఈరోజు రాజ్యసభలో రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. త్వరలోనే ఈ డెమాండ్ మేరకు పనులు జరగబోతున్నాయని తెలుస్తుంది.
