ఈరోజుల్లో ఎన్నికల్లో గెలవాలి అంటే డబ్బు, మందు ఇలాంటివి ఉండాల్సిందే. ప్రజలకు వీటి రుచి చూపించి ఓట్లు వేయించుకుంటారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన మాస్టర్ ప్లాన్ ఇదే అని చెప్పాలి. తప్పుడు హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి చివరికి గెలిచాక చేతులు ఎత్తేశాడు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో గెలవడానికి అన్ని అడ్డదారులు తొక్కినా చంద్రబాబు గెలవలేకపోయాడు. కాని జగన్ విషయంలో అలా జరగలేదు. డబ్బు, మందు ఇలాంటివి ఏమీ లేవు. కేవలం ఆయనపై నమ్మకంతో ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “స్థానిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు ఆశచూపిన డబ్బు తీసుకోవడానికి ఓటర్లు తిరస్కరించారు. చంద్రబాబు భయపడిందిక్కడే. డబ్బు, మందు లేకుండా ఎలక్షన్లు జరిగితే జిల్లాల వారిగా సింగిల్ డిజిట్ కే పరిమితమవుతామన్న ఆందోళనతో డ్రామాలు మొదలు పెట్టాడు. నిమ్మగడ్డతో వాయిదా నాటకం ఆడించాడు”.
