Home / ANDHRAPRADESH / స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ పన్నిన మరో కుట్రను బయటపెట్టిన వైసీపీ నేత..!

స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ పన్నిన మరో కుట్రను బయటపెట్టిన వైసీపీ నేత..!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైయస్ జగన్ సీఎం అయిన మరుసటి రోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రతిక్షణం విషం కక్కుతూనే ఉన్నాడు. తన ఐదేళ్ల అరాచక, అవినీతి పాలనను సహించలేక ప్రజలు చిత్తుగా ఓడించిన సంగతిని చంద్రబాబు మరిచాడు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే దుష్ప్రచారం చేయడం మొదలెట్టాడు.  తాను అధికారంలో లేకపోతే..ఏదో అరాచకం జరిగిపోతుందన్నట్లుగా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నాడు. గత 9 నెలలుగా ఏదో ఒక అంశంపై రాజకీయం చేస్తూ..ఎల్లోమీడియాతో కలిసి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతే  టీడీపీ మనుగడకే ప్రమాదమని గ్రహించి..తన సామాజికవర్గానికే చెందిన ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని ఎన్నికలను వాయిదా వేయించాడు. అంతే కాదు.. ఆఖరికి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి ప్రతిష్ట దెబ్బతినేలా పలు నిందారోపణలతో ఈసీ నిమ్మగడ్డ చేత కేంద్ర హోంశాఖకు లెటర్ రాయించి ఆ లేఖను ఎల్లోమీడియాలో ప్రసారం చేయించి ప్రభుత్వంపై బురదజల్లాడు.

 

అయితే తాజాగా చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను గెలిస్తే ఈదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టుగా, తాను ఓడిపోతే అసలు ప్రజాస్వామ్యమే లేదన్నట్టుగా చిత్రీకరించి దాన్ని ఎల్లోపత్రికలపై చూపించడం చంద్రబాబుగారికి అలవాటే అని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలిచ్చే తీర్పు, ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా ఉంటాయనేదే చంద్రబాబు భయమని సజ్జల తెలిపారు. అందుకే లేఖ డ్రామా తర్వాత చంద్రబాబుమరో డ్రామాకు తెరలేపారని ఫైర్ అయ్యారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరగని ఘటనలు జరిగినట్టుగా సృష్టించి, పచ్చ ఫిర్యాదుల కట్టను తన మనిషైనా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌కు పంపించాలని చంద్రబాబు టీడీపీ కేడర్‌ను ఆదేశించారని, వాటికి నంబరింగ్‌ ఇచ్చి మరో రచ్చకు సిద్దం కావాలన్నదే ఆయన పథకమని సజ్జల ఆరోపించారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు చేస్తున్న కుట్రలను వైసీపీ నేత సజ్జల ట్విట్టర్ వేదికగా బయటపెడుతూ  తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం సజ్జల ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat