చంద్రబాబు ఒక ఈవెంట్ మేనేజర్.. ఇదేమీ విపక్షాల విమర్శ కాదు.. చాలా సందర్భాల్లో ఇది రుజువైంది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండిఉంటే ఎలా ఉండేదో తెలుసా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా మీడియాలో చంద్రబాబు గురించి పుంఖానుపుంఖాలుగా పొగుడ్తూ ప్రశంసలు గుప్పిస్తారట.. చంద్రబాబు కూడా కరోనా గురించి రోజుకు రెండుసార్లు టీవీల్లో కనిపిస్తారట.. కరోనాపై దండయాత్ర, కరోనాను ఖతం చేద్దాం వంటి ప్రోగ్రాములు నిర్వహిస్తారట. కరోనాపై చంద్రబాబు చర్యలను ఇతర దేశాలు మెచ్చుకున్నట్టు, వాళ్లు కూడా ఇక్కడి పద్ధతులు ఫాలో అవుతున్నట్టు తెలుగుదేశం అనుకూల పత్రికల్లో వార్తలు వస్తాయట.. ముఖ్యంగా కరోనా నిరోధించుందుకు చంద్రబాబు చేస్తున్న చర్యలకు జగన్ అడ్డు పడుతున్నట్టు మాట్లాడతారట. అన్ని టీవీలు, పేపర్లలో యాడ్స్, భారీ హోర్డింగులు ఏర్పాటు చేసేవారట.. థాంక్యూ సీఎం సార్, ప్రపంచానికే కరోనా కట్టడి నేర్పించాను లాంటి ఎన్నో జరుగుతాయంటూ చెప్పుకొస్తున్నారు.
