ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనమీద ఉన్న కేసులకు భయపడి ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రపెద్దలవద్ద తాకట్టు పెట్టారా..? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజల కోసం చేసిందేమిటి..? చిన్నారుల నుంచి వృద్ధుల వరకు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ఇలా ప్రతీ ఒక్కరు చంద్రబాబు మోసానికి బలైపోయిన వారేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేక హోదాపై ఉద్యమం వచ్చిన ప్రతీసారి చంద్రబాబు తన అధికారబలంతో.. ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు చేయని కుఠిలరాజకీయం లేదు. అయితే, రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, వైఎస్ జగన్‌ల మాటతీరు, పనితీరును పరిశీలిస్తే…
see also : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నేత..! డేట్ ఫిక్స్..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పి.. తీరా అధికారం చేపట్టాక ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా..? అని అంటూ తన కుఠిల రాజకీయాన్ని మరోసారి ప్రదర్శించారు. అంతేకాకుండా, ఇటీవలే అరుణ్‌జైట్లీ మీడియా సమావేశం తరువాత సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా రాదు.. ఏపీ ప్రజలు జర్మీ ప్రజల్లానే కష్టపడాలి అంటూ చెప్పడం బాధాకర విషయం.
see also : 2019లో జగన్ సీఎం అవడం ఖాయం..! కారణాలు చెప్పిన నటుడు శివాజీ..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి..!!
ఇదిలా ఉండగా.. నాడు రాష్ట్ర విభజన సమయం నుంచి.. నేటి వరకు ప్రత్యేక హోదా అనే అంశం ఇంకా ప్రజల నోట్లో నానుతుందంటే అందుకు కారణం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అధికారంలో లేకపోయినా.. ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ.. అటు కేంద్ర ప్రభుత్వంతోనూ పోట్లాడుతూ ప్రత్యేక హోదా అనే అంశంపై పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే.
see also : చిక్కుల్లో ఈడీ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కారణమిదే..!!
ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ గత నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. యువభేరిలతో యువతలో చైతన్యం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలని కాంక్షిస్తూ పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని మొదటి నుంచి అందరినీ కోరారు. హోదా ఉద్యమానికి సమాజంలోని అన్ని వర్గాల వారు మద్దతు పలకాలని కోరారు. పార్లమెంట్‌లో తన పార్టీ ఎంపీలతో, శాసనసభలో తాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేశారు.. హోదాక ఓసం విభిన్న నిరసనల ద్వారా పోరాటం చేశారు. దీక్షలు, ధ్నాలు, ర్యాలీలు, యువభేరి సదస్సులు చేపట్టారు. యువతలో చైతన్యం తెచ్చారు. హోదా కోసం ఆమరణ నిరాహారదీక్షకు దిగింది వైఎస్ జగన్ మాత్రమే అన్న మాటలో సందేహం లేదు.
see also : చంద్రబాబు గురించి బీభత్సమైన స్టోరీ చెప్పిన జగన్..!!
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హోదా హామీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడిచాయి. చంద్రబాబు ప్రశ్నించకపోవడం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జగన్ హోదా ఉద్యమాన్ని తన భుజాలపై వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రపతిని పలుమార్లు కలిసి ఈ విషయంపై చర్చించారు. జగన్ నాలుగేళ్లపాటు చేస్తున్న ఈ ఒంటరి పోరాటానికి ముందు నుంచి యువకులు, విద్యార్థుల మద్దతు ఉన్నా ఇప్పుడు ఈ మద్దతు మరింత ఎక్కువైంది. ఆదినుంచి జగన్ చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. అయితే, మధ్యలో కొన్ని చేతులు కలిశాయి, కొందరు వచ్చారు, వస్తున్నారు, హోదా కోసం గళమెత్తుతున్నారు. మంచిదే సంతోషం కానీ వాస్తవానికి హోదా ఉద్యమాన్ని రగిలించింది వైఎస్ జగన్. బ్రతికించింది వైఎస్ జగన్. చివరకు సాధించేది జగనే అంటూ ఏపీ ప్రజలు గళమెత్తుతున్నారు.
ఇదే క్రమంలో వైఎస్ జగన్ వైఎస్ఆర్‌సీపీ ఎంపీల చేత రాజీనామా చేయించుందుకు కూడా వెనుకాడలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశంపై నిర్ణయం తీసుకోకుంటే వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా వైఎస్ జగన్ నాడు సమైక్యాంద్ర పోరాటంలోనూ .. నేడు ప్రత్యేక హోదాపై ఒకే మాటమీద నిలబడటం చూస్తున్న ఏపీ ప్రజలు వైఎస్ జగన్‌కు మద్దతును తెలుపుతున్నారు.