ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విజయవంతంగా ముగిసి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై పార్టీలకు అతీతంగా సీనియర్ రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. మరో వైపు వైఎస్ జగన్‌పై ప్రజల ఆదరణ రోజురోజుకు పోరుగుతోంది. అయితే, వైఎస్ జగన్ తాను చేస్తున్న పాదయాత్రలో నిత్యం చంద్రబాబు అవినీతిని ఏకిపారేస్తూ.. 2019లో తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్తూ, ప్రజా సంక్షేమ పథకాలపై తన అభిప్రాయాలను జనంతో పంచుకుంటున్నారు వైఎస్ జగన్. ఇలా అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ.. వారి సమస్యలను వింటూ.. పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు జగన్.
see also : శేఖర్‌రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులకు చిప్పకూడే..!!
see also : జగన్‌పై కేసులు కుట్రపూరితమే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయవాది..!!
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్‌పై ఉన్నవన్నీ అక్రమ కేసులేనని, నాడు కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ నేతల మాట విననందునే వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు బనాయించారన్న విషయం జగమెరిగిన సత్యం. ఈ మాటను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలే పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ మీడియా ముఖంగా వెల్లడించారు. అంతేకాకుండా, ఏకంగా సుప్రీం కోర్టు న్యాయవాదులే జగన్‌పై ఉన్నవన్నీ అక్రమంగా బనాయించినవేనని చెప్పడం గమనార్హం. ఇవన్నీ బేరీజు వేసుకుంటే వైఎస్ జగన్ నిర్దోషని చెప్పక తప్పదు.
see also : వైసీపీ ఒక దొంగల పార్టీ..చంద్రబాబు
see also : 16 నెలలు జైల్లో ఉన్నా మార్పు రాలే..!!
అయితే, జగన్ నిర్దోషి అంటూ చెప్పిన వారిలో తాజాగా బీజేపీ సీనియర్ నేత, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్‌రెడ్డి చేరిపోయారు. వైఎస్ జగన్ నిర్దోషి అని, ఆ మాటను ఎక్కడికొచ్చి చెప్పమన్నా చెప్పేందుకు నేను సిద్ధమంటూ బల్లగుద్ది చెప్పారు. కాగా, ఇవాళ విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ మాటను జగన్ ధిక్కరించినందునే నాడు వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టిందని చెప్పారు. ఇలా కాంగ్రెస్ నేతలు కుట్ర పన్ని మరీ వైఎస్ జగన్‌పై పెట్టిన కేసులన్నీ వీగిపోవడం ఖాయమని బీజేపీ నేత వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో గెలవాలనే తాపత్రయంతోనే చంద్రబాబు వైసీపీ, బీజేపీపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారన్నారు. 2014 ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు అధికారం చేపట్టాక ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా..? అంటూ ప్రశ్నించిన చంద్రబాబు వ్యక్తిత్వాన్ని గుర్తు చేశారు విష్ణువర్ధన్‌రెడ్డి.