ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లపాటు కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నారని, ఆ సమయంలో ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని అడిగిన పాపాన పోలేదని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ..
see also:సీఎం చంద్రబాబుకు మోత్కుపల్లి సవాల్..!
సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాబు రావాలంటే.. బాబు రావాలనే నినాదాన్ని సృష్టించి.. అలాగే, బాబు అధికారంలోకి వస్తేనే ఏపీలో మహిళలకు రక్షణ ఉంటుందంటూ ప్రకటనలు గుప్పించి ప్రలను నట్టేట ముంచారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదన్నారు. అలాగే, టీడీపీ నేతలే ఏపీలోని మహిళలపై దాడులకు తెగపడటం సిగ్గుచేటని విమర్శించారు.
see also:జగన్ కే ఓటేయండి..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు..!!
ఇక వైఎస్ జగన్ గురించి చెప్పాలంటే.. వాళ్ల మేనత్తలు అందరూ దళితులను పెళ్లి చేసుకున్నారని, కుల రహిత, పేదోళ్లు, బలహీన వర్గాలు ఉన్న కుటుంబం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కూడా సమాజం కుల రహితంగా ఉండాలని భావించినట్టే.. ముందుగా తన కుటుంబాన్ని కులరహితంగా మార్చి.. ఆపై సమాజాన్ని కులరహితంగా మార్చేందుకు వైఎస్ఆర్ కృషి చేసినట్టు మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు.