ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 110 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం గుంటూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, జగన్ చేస్తున్న పాదయాత్ర ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎప్పటికప్పుడు వైఎస్ జగన్‌పై ప్రజాదారణ పెరగడం, మరోవైపు పలు టీవీ ఛానళ్లు, రాజకీయ పార్టీలు చేస్తున్న సర్వేల్లోనూ.. వైఎస్ జగన్‌కే సీఎంగా పట్టం కట్టడం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సర్వే, మోడీ అనుకూల మీడియా సర్వే, అలాగే, రిపబ్లికన్ టీవీ సర్వేల్లోనూ వైఎస్ జగనే సీఎం అని తేలింది. దీంతో పలు రాజకీయ పార్టీ నాయకులు, నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
see also : టీడీపీ రాజ్యసభ అభ్యర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
see also : కేసీఆర్‌ను మెచ్చుకొని బాబును వాయించేసిన సీనియర్ ఐఏఎస్
అందులో భాగంగానే నలబై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న కనుమూరి బాపిరాజు వైసీపీలో చేరనున్నారు అని జిల్లా రాజకీయాల్లో మంచి హాట్ టాపిక్ గా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం.. ఇప్పట్లో కనుచూపు మేర ఆ పార్టీ బ్రతికి బట్ట కట్టే పరిస్థితి లేకపోవడంతో బాపిరాజు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన అనుచవర్గం అంటున్నారు. అయితే గత నాలుగు ఏండ్లుగా రాజకీయాల్లో మౌనంగా ఉన్న ఆయన తనను నమ్ముకున్నారి, క్యాడర్కు నిత్యం అందుబాటులో ఉంటూ తనపై ప్రజల్లో ఉన్న మద్దతునే అలాగే నిలబెట్టుకున్నారు.
see also : రాజ్యసభకు నిస్వార్థ సైనికుడు..!
see also : ”2019లో జగన్‌కు జైలు.. టీడీపీకి గెలుపు” కన్ఫాం..!!
అయితే ప్రస్తుతం విభజన చట్టంలో ఉన్న హామీలను తుంగలో తొక్కడమే కాకుండా ఏపీకి న్యాయ బద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ,ఉక్కు పరిశ్రమలాంటివి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కడంతో వైసీపీ గత నాలుగు ఏండ్లుగా ప్రజల పక్షాన పోరాడుతూనే మరోవైపు విభజన చట్టంలోని హామీల అమలుపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న తీరుకు నచ్చి ..జగన్ నాయకత్వాన్ని బలపరచడానికి ..రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి తానూ ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఆయన అనుచవర్గం అంటున్నారు.అయితే జగన్ త్వరలో పాదయాత్రలో భాగంగా గుంటూరు రానున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభను పెట్టి పార్టీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా పెట్టించారు బాపిరాజు.