ఆ డబ్బు చంద్రబాబు, లోకేష్‌లదే.. గుట్టు విప్పిన శేఖర్‌రెడ్డి..!!, ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న సమయంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ, ఈడీ అధికారులు, ఐటీ విజిలెన్స్ విభాగాలు దాడి చేసి 180 కోట్ల రూపాయల నగదు, 117 కిలోల బంగారం బయటపడిన విషయం తెలిసిందే.
see also : శేఖర్‌రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులకు చిప్పకూడే..!!
ఇక అసలు విషయానికొస్తే.. ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న సమయంలో మారుమోగిపోయిన శేఖర్‌రెడ్డి పేరు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, గత కొంత కాలంగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ నారా లోకేష్‌కు, శేఖర్‌రెడ్డికి అక్రమ లావాదేవీలు ఉన్నాయని, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక, ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న కొత్త కంపెనీల్లోనూ శేఖర్‌రెడ్డికి నారా లోకేష్ వాటా ఇచ్చినట్లు సమాచారం. ఏపీలో శేఖర్‌రెడ్డికి సంబంధించిన బంగారం వ్యాపారం, కొత్త కంపెనీలు వంటి వ్యాపార లావాదేవీలను నారా లోకేష్ నిర్వహిస్తాడన్నది పవన్ కల్యాణ్ మాటల ఆంతర్యం.
అయితే, పవన్ కళ్యాణ్ నారా లోకేష్‌పై చేస్తున్న ఆరోపణలను నిశితంగా గమనించిన ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఇటీవల కాలంలో శేఖర్‌రెడ్డిని పిలిపించి గట్టిగానే విచారించిందని, ఈడీ విచారణలో శేఖర్‌రెడ్డి నారా లోకేష్, చంద్రబాబు తనతో నడుపుతున్న వ్యాపార లావాదేవీల గుట్టును విప్పినట్లు సమాచారం. శేఖర్‌రెడ్డితో నారా లోకేష్, చంద్రబాబు వ్యాపార లావాదేవీల గుట్టును లాగిన ఈడీ త్వరలో అమరావతిలోకి అడుగు పెట్టనుందని, ఈడీగనుక అమరావతిలో అడుగుపెడితే.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు, ఐటీశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ జైలుకెళ్లడం గ్యారెంటీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.