ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొడుకు, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారాలోకేష్ వ్యవహారశైలి తరచూ వివాదాస్పదమవుతోంది. ఇటీవల సొంత పార్టీలో లుకలుకలకు ఆయన కారణమైతే తాజాగా ఆయనపై అసంతృప్తిని కొంతమంది టిడిపి సీనియర్ నాయకులు వెలిబుచ్చారట.. రాష్ట్ర రాజకీయాలనుంచి ఆయనను కాస్త దూరంగా ఉంచాలనుకుంటున్నారట.. ఆయన ఇక్కడ ఉంటే…ఎప్పటి నుంచో… పార్టీలో ఉంటున్న సీనియర్లకు ఇబ్బందిగా ఉంటోందట. ప్రతి విషయానికి లోకేష్ వద్దకు రావడానికి వారికి సీనియర్ నేతలకు చిన్నతనంగాఉందని ఫీల్ అవుతున్నారట.
తమ కళ్లముందు పుట్టి, పెరిగిన లోకేష్ వద్దకు వెళ్లి నిలబడి ఏమైనా అడగడానికి చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఫీలవుతున్నారట. పాతతరానికి చెందిన నలుగురు నాయకులు పార్టీలో నెంబర్‌టూగా ఉన్న లోకేష్‌తో వ్యవహరించడం కష్టంగా ఉంటుందట. చాలాకాలంనుంచి లోకేష్ కు వారికి మధ్య చిన్నచిన్న విభేదాలు, అపార్ధాలు వచ్చాయని పార్టీవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ విషయంలో పార్టీపుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులతో పాటు ఇటీవల ఇతర పార్టీల నుంచి టిడిపిలో చేరిన నాయకులు కూడా ఉన్నారట. ముగ్గురు సీనియర్ మంత్రులు ఈ విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారట.. జాతీయ రాజకీయాల్లోకి లోకేష్ వెళితే ఆయన కేంద్రంలో అనుభవాన్ని బాగా సంపాదించుకుంటారని వారు చెబుతున్నారట. కొందరు జాతీయ నేతల పుత్రరత్నాలను, వారసత్వాలను అందిపుచ్చుకున్న వారిని దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారట.. ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేస్తే జాతీయ స్థాయిలో ఇమేజ్ వస్తుందని వారు చెబుతున్నారటఇదంతా ఒక పద్దతి ప్రకారం ‘లోకేష్’ను ఇక్కడ నుంచి తప్పించడానికి చేస్తోన్న ప్రయత్నమని తెలుస్తోంది.