టీడీపీ అధినేత చంద్రబాబుగారి పుత్ర రత్నం లోకేష్ గారి భాషా ప్రావీణ్యం గురించి మనకందరికి తెలిసిందే..తెలుగు భాషలోనే తడబడుతూ మాట్లాడుతూ పలుసార్లు నవ్వుల పాలయ్యాడు.. అందుకే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ..పప్పులాంటి అబ్బాయి అంటూ లో్కేష్‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు. తన కొడుకు భాషా ప్రావీణ్యాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఏకంగా లోకేష్‌కు తెలుగు ట్యూషన్ కూడా పెట్టించాడు..అయినా ఫలితం లేకుండా పోయింది…డెంగ్యూ జ్వరాన్ని బూతుపదం అర్థం వచ్చేలా పలికి ప్రజలనే కాదు..తెలుగు తమ్ముళ్లనే సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు. అలాంటి లోకేష్ హిందీ భాషలో ఇరగదీశాడంటూ..ఎల్లోమీడియా పండుగ చేసుకుంటోంది. తాజాగా డిసెంబర్ 5 న కియా కార్ల ఫ్యాక్టరీ ఓపెనింగ్ సెర్మనీలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఇంకేముంది లోకేష్ బాబు ట్విట్టర్‌లో వెంటనే కూతెట్టేశాడు. వైయస్ జగన్ గారు, ముద్దొస్తున్నాడని పక్కింటివారి పిల్లోడికి మీ ఇంటి పేరు పెట్టుకున్నట్టే..నారా చంద్రబాబు నాయుడు తెచ్చిన కియా మీ నాయన మహామేత తెచ్చాడనడంలాగే ఉంది. చంద్రన్న ప్రారంభించిన కియాకి మళ్లీ రిబ్బన్ కట్ చేయడానికి సిగ్గనిపించలేదా? టీడీపీ చేసిన అభివృద్ధి-సంక్షేమానికి పేర్లు మార్చడం, రంగులేయడం, మళ్ళీ మళ్ళీ ప్రారంభోత్సవాలు చేయడం క్యా ‘కియా’ జగన్‌మోహన్‌రెడ్డి సాబ్! మీ చేతకానితనం వల్ల దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ని చూసి నవ్వుతోంది. కమిషన్ల కోసమే చంద్రబాబు కియా తెచ్చారని అన్నారుగా! మరి నిన్న అదే పరిశ్రమ ప్రారంభానికి ఎంత కమీషన్ ముట్టిందో మీకు! మీరు విపక్షంలో ఉంటే కియా దండగా! మీరు సీఎం అయితే కియాతో పండగా? అంటూ ట్వీటేసి మురిసిపోయాడు. ఈ మధ్య చినబాబు జబర్దస్త్ బాగా ఫాలో అవుతున్నట్లు ఉన్నాడు.. . కియా విషయంలో ప్రాసల కోసం పాకులాడుతూ.. క్యా కియా జగన్ మోహన్ రెడ్డి అంటూ..పంచ్ వేశానని మురిసిపోయాడు..ఇంకేముంది నా పొలంలో మొలకలు వచ్చాయన్నంత సంబురంగా మా చినబాబు హిందీలో ఇరగదీసాడు అంటూ క్యా కియా జగన్ సాబ్ అంటూ హెడ్డింగ్‌లు పెట్టుకుని ఎల్లోమీడియా ఆనంద భాష్పాలు రాల్చింది. అసలు తెలుగు సరిగా లోకేష్ హిందీలో మాట్లాడాడు అంటే..నిజంగా వింతే..గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో మా తాతా భీ హైదరాబాద్ మే రహతా హూ అంటూ చెలరేగిపోయాడు..లోకేష్ హిందీ భాషా ప్రావీణ్యం చూసి హైదరాబాద్ ప్రజలు కళ్లు అవాక్కయ్యారు..ఇక లోకేష్‌కు పిల్లనిచ్చిన మామ బాలయ్య అయితే సారే జహాసే అచ్ఛా పాటను ఖూనీ చేసి బుల్ బుల్ పాటగా మార్చేశాడు…మళ్లీ ఇన్నాళ్లకు మళ్లీ హిందీలో ఒక్క క్యాకియా జగన్ మోహన్ రెడ్డి అన్న పదం ట్వీట్‌లో వాడినందుకు వహ్వా క్యా బోల్తా హై చినబాబు అంటూ ఎల్లోమీడియా ఛానళ్లు పండుగ చేసుకుంటున్నాయి.
