విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని చంద్రజ్యోతి పత్రిక అసత్యకథనం ప్రసారం చేసింది. ఈ వార్తను పట్టుకుని టీడీపీ నేతలు బోండా ఉమ తదితరులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ రెచ్చిపోయారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవి అభ్యంతరం చెప్పిందని, ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసిందని, మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయద్దని మొట్టికాయలు వేసిందని..దీంతో జగన్ సైలెంట్ అయిపోయాడని బోండా ఉమ విషం కక్కాడు..విశాఖలో రాజధాని ఏర్పాటుపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు అనుకుల మీడియా, టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ..విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు అంటూ మండిపడ్డారు. అలాగే ప్రజా చైతన్య యాత్రలో మద్యం రేట్లు పెరిగియా…అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయా…ఏదో బలహీనతతో ఓ పెగ్గు వేసుకునే వాళ్లకు ఏంటీ ఖర్మ అని చంద్రబాబు చేసిన విమర్శలపై కూడా విజయసాయిరెడ్డి స్పందించారు. మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్నవారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసిందాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేడు. ఇప్పుడిపుడే తాగుడుకు దూరమై భార్యాపిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారు. 14 ఏళ్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం దేశంలో ఎక్కడా కనిపించదు అంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
