విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చంద్రబాబు అనుకుల మీడియా విషం కక్కుతుంది. విశాఖలో తరచుగా తుఫానులు, వరదలు వస్తాయని, సముద్రమట్టం అసాధారణంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని, అసలు విశాఖలో రాజధాని ఏర్పాటుకు తగిన భూములు కూడా లేవని, రక్షణాపరంగా సేఫ్ కాదని..ఇలా పలు అసత్యకథనాలు వండివారుస్తోంది. తాజాగా నేవీను కూడా ఎల్లోమీడియా వదల్లేదు. విశాఖ రాజధానిపై నేవీ అభ్యంతరం చెప్పిందంటూ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అంతే కాదు..మిలీనం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయద్దంటూ..ఏపీ ప్రభుత్వానికి నేవీ లేఖ రాసినట్లు ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేసింది. ఎల్లోమీడియా కథనాలను పట్టుకుని టీడీపీ నేత బోండా ఉమ ప్రెస్‌మీట్ పెట్టి మరీ..మిలీనియం టవర్ లో సచివాలయం వద్దని నేవీ తేల్చి చెప్పిందని దీంతో ఏం చేయాలో తెలీక సీఎం జగన్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందని గగ్గోలు పెట్టాడు.
దేశ రక్షణకు సంబంధించిన అనేక కార్యాలయాలు, నేవికి సంబంధించిన పరిశోధన సంస్థలు, ఐఎన్‌ఎస్ కళింగ, జలాంతర్గాముల తయారీ కేంద్రాలు అన్ని కూడా విశాఖలోనే ఉన్నాయి. ఒకవేళ విశాఖను పరిపాలన రాజధానిగా ఆ ప్రాంతం మొత్తం జనాలతో నిండిపోతుంది. దీని వలన దేశరక్షణకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి అంటూ బోండా ఉమ విషం కక్కాడు. అయితే విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ అభ్యంతరం చెప్పిందన్న టీడీపీ, ఎల్లోమీడియా ప్రచారాన్ని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని నేవీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పీఐబీ రక్షణ విభాగం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈఎస్‌ఐ కుంభకోణం, అమరావతి భూముల అక్రమాలపై సిట్ విచారణ నేపథ్యంలో.. ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు అనుకుల మీడియా ఎత్తుగడ వేసింది. మిలీనియం టవర్స్‌కి ఐఎన్ఎస్ కళింగ ప్రాంతం దగ్గరగా ఉన్నందునే నేవీ అడ్డు చెప్పిందంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేసింది. కాగా ఎల్లో మీడియా తప్పుడు వార్తలను తూర్పు నావికాదళం తీవ్రంగా ఖండించింది. ఈ తప్పుడు కథనాలపై కేంద్ర రక్షణశాఖ దృష్టికి తీసుకెళ్తామని నేవీ అధికారవర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా విశాఖలో రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు అనుకుల మీడియా పన్నిన కుట్ర బట్టబయలైంది.