Home / ANDHRAPRADESH / అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్‌ దర్యాప్తు షురూ… పలు కీలక ఆధారాలు లభ్యం..బాబు బ్యాచ్ బేజారు..!

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్‌ దర్యాప్తు షురూ… పలు కీలక ఆధారాలు లభ్యం..బాబు బ్యాచ్ బేజారు..!

టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్‌ నియమించిన సిట్ బృందం పని మొదలుపెట్టింది. తొలుతగా అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ ఫోకస్ పెట్టింది. తాజాగా సిట్‌ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం విజయవాడలో మెరుపు దాడులు నిర్వహించింది. రాజధానిలో తెల్లకార్డులతో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. అలాగే విజయవాడ పటమటలో కొందరు కోటీశ్వరుల ఇళ్లను కూడా సిట్ తనిఖీ చేసింది. వీరిలో ఒకరు టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువుగా చెబుతున్నారు. ఈ సోదాల్లో సిట్‌ పలు కీలక ఆధారాలను సేకరించింది. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ పెద్దలకు బినామీలుగా వ్యవహరిస్తున్నవారి నుంచి సిట్ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. వారి ఆస్తులు, ఆదాయాలు, రాజధానిలో కొన్న భూములు, వాటికి డబ్బులు ఎలా వచ్చాయి, టీడీపీ నేతలతో వారి సంబంధాలపై ప్రశ్నించడంతోపాటు వారి వద్ద అనేక పత్రాలను తీసుకుని పరిశీలించారు.

 

కాగా, ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలపై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈడీ కూడా మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో టీడీపీ పెద్దలు భారీగా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, బినామీల పేరుతో, తెల్లకార్డుదారులను అడ్డం పెట్టుకుని వందలాది ఎకరాలు కొట్టేశారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు హవాలా, మనీలాండరింగ్ ద్వారా తమ ఖాతాల్లోకి మళ్లించారని సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు చెందిన బినామీలుగా వ్యవహరిస్తున్న కొందరు ప్రముఖులతోపాటు తెల్లకార్డులతో భూములు కొనుగోలు చేసిన వారిని కూడా సిట్ తొలుత విచారించినట్లు తెలుస్తోంది. మొత్తంగా అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తు షురూ చేసిన సిట్ అధికారులకు తొలి రోజే పలు కీలక ఆధారాలు లభ్యం కావడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. సిట్ అధికారులు ఎప్పుడు ఎవరిని పిలుస్తారో…ఎవరి ఇళ్లమీద దాడులు చేస్తారో అంటూ.. బాబు బ్యాచ్ టెన్షన్‌లో పడింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat