Home / ANDHRAPRADESH / టీడీపీ మాజీమంత్రి అయన్నపాత్రుడికి లేడీ పోలీస్ ఆఫీసర్ స్ట్రాంగ్ వార్నింగ్..!

టీడీపీ మాజీమంత్రి అయన్నపాత్రుడికి లేడీ పోలీస్ ఆఫీసర్ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ‌్యంలో ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని కుట్రపూరితంగా ఎన్నికలను వాయిదా వేయించాడని అధికార పార్టీ వైసీపీ ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతల అక్రమాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని..ఏపీలో పోలీస్ టెర్రరిజం అంటూ చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తే.. ఇండియన్ పోలీస్ సర్వీసా..జగన్ పోలీస్ సర్వీసా అంటూ టీడీపీ నేతలంతా విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా తమపై నీచమైన ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలపై ఏపీ పోలీసులు మండిపడుతున్నారు.

 

40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల సీఎం అంటావ్. నీ పాలనలో పోలీస్ శాఖకు ఏం చేశావో దమ్ముంటే ఒక్కటి చెప్పు. నీ భద్రత కోసం విధుల్లో ఉన్న పోలీసులకు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వని ఘనత నీది అంటూ పోలీస్ అధికారుల సంఘం చంద్రబాబుపై నిప్పులు చెరిగింది. ముఖ్యంగా మాచర్ల తమ ప్రాణాలకు తెగించి టీడీపీ నాయకుల ప్రాణాలను కాపాడామని… ప్రాణాలు కాపాడిన పోలీసులనే నిందించడం బాధ కలిగించిందని పోలీస్ అధికారుల సంఘం పేర్కొంది. టీడీపీ నాయకులెవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది. తమపై అనవసర అభియోగాలు చేస్తే కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడమంటూ టీడీపీ నేతలపై పోలీస్‌ అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ క్రమంలో ఖాళీ బట్టలు తీసి రాజకీయాల్లోకి రావాలని పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిపై ఏపీ స్టేట్‌ పోలీస్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్వర్ణలత మండిపడ్డారు.

 

రాజకీయాల్లో ఎంతో అనుభవముందని చెప్పుకునే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి రాజకీయాలు చేతకాకపోతే.. ఇంట్లో మూల కూర్చోవాలని, పోలీసులను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని ఏపీ స్టేట్‌ పోలీస్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్వర్ణలత అన్నారు. తాజాగా మీడియాతో ఆమె మాట్లాడుతూ మాకు ఎవరిపై ప్రేమలుండవని చట్ట ప్రకారం మా విధులు మేము చేసుకుంటామన్నారు. ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లో పోటీ చేయాలని మాజీ మంత్రి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తాము ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లోకి వస్తే అయ్యన్న పార్టీకి పుట్టగతులే ఉండవన్నారు. ఆయన రాజకీయ జీవితం ఇప్పటికే శూన్యమైపోయిందని ఎద్దేవ చేశారు. అయ్యన్న తీరు చూస్తే ప్రజలకే అసహ్యం వేస్తోందని విమర్శించారు. పోలీస్‌ వ్యవస్థ అంటే ఎవరి కింద పనిచేసేది కాదని.. నిరంతరం ప్రజలకు రక్షణగా నిలుస్తుందని స్వర్ణలత గుర్తు చేశారు.

 

ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి, ఎన్నో ప్రభుత్వాలు పోతుంటాయి.. కానీ తామెప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం.. ప్రజల రక్షణ కోసం పని చేస్తూనే ఉంటామన్నారు. నిజాయితీతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పాటుపడుతున్న డీజీపీ గౌతం సవాంగ్‌పైనే తప్పుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అయ్యన్న తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవేనా అని ఆమె విమర్శించారు. దేశంలోనే అతి ఉత్తమంగా పని చేస్తున్న ఏపీ పోలీస్‌ వ్యవస్థపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని స్వర్ణలత హెచ్చరించారు.మొత్తంగా ఏపీ పోలీసులకు, టీడీపీ నేతలకు జరుగుతున్న రగడ రాజకీయాలను హీటెక్కిస్తోంది.