Home / ANDHRAPRADESH / ఈసీ లేఖ లీకుపై పోలీస్ దర్యాప్తు ముమ్మరం.. బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!

ఈసీ లేఖ లీకుపై పోలీస్ దర్యాప్తు ముమ్మరం.. బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!

ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ లీక్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మురం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్డ్ తీర్పు ఇచ్చిన అరగంటలోనే ఎల్లోమీడియాలో ఈసీ లేఖ ప్రసారం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. ఈసీ లేఖ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈసీ నిమ్మగడ్డతో కుమ్మక్కై లేఖను కేంద్ర హోంశాఖకు రాయించి, అదే లేఖను 5 ఎల్లోమీడియా ఛానళ్లలో ప్రసారం చేయించాడని, రెండు టీడీపీ అనుకుల పత్రికల్లో ప్రచురించారని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా వైసీపీ ఎమ్మెల్యేలు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో లేఖ లీక్‌ వెనుక కుట్రను ఛేదించేందుకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు.

తొలుత ఎల్లోమీడియా మీడియా వైపు నుంచి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఐదు మీడియా సంస్థలకు ఆ లేఖ లీకైనట్టు పోలీసులు గుర్తించారు. ఎల్లోమీడియా ఛానళ్లకు ఈసీ లెటర్ ఎలా చేరింది? ఎవరు చేరవేశారు? అలా చేయడం వెనుక వారి ఉద్దేశం ఏమిటి? అందువల్ల కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటి? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆయా మీడియా ప్రతినిధులకు వాట్సాప్‌ ద్వారా రాజకీయ నాయకుల నుంచి ఈ లేఖ వెళ్లినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్థారించారు. కాగా ఈసీ నిమ్మగడ్డ లేఖ మీడియాలో ప్రసారం అయ్యేలా చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి లోకేష్ చక్రం తిప్పినట్లు తెలిసింది. దాదాపు 30 నిముషాల వ్యవధిలో ఐదుగురు మీడియా ప్రతినిధులకు లోకేష్ ఫోన్ చేసి వెంటనే ఆ లేఖను వెంటనే బ్లాస్ట్‌ చేయాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాతే వారి వాట్సాప్‌లకు లేఖ లీక్‌ చేయడం, చంద్రబాబు అనుకుల మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం కావడం జరిగిపోయాయి.

అయితే ఈసీ లేఖ అందింది అంటూ…కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరి అత్యంత రహస్యంగా ఉంచాల్సిన ఆ లేఖ ఎల్లోమీడియాకు ఎలా లీకైందనే అంశంపైనా పోలీసులు దృష్టి పెట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కేంద్ర ప్రభుత్వంతో మెయిల్‌ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు గోప్యంగానే జరుపుతారు. అలాంటప్పుడు అధికారికంగా రాసిన లేఖను లీక్‌ చేయడం పెద్ద నేరమే అవుతుంది. కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకే నిమ్మగడ్డ కావాలనే తన మెయిల్‌నుంచి లేఖను చంద్రబాబు, లోకేష్‌లకు చేరవేశాడా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో లేఖ లీకుపై పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. కాగా ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలనే కుట్రతోనే చంద్రబాబు, లోకేష్, నిమ్మగడ్డలు కలిసి వివాదాస్పద అంశాలతో కేంద్ర హోం శాఖకు లేఖ రాయించి, అదే లేఖను ఎల్లోమీడియాకు లీక్ చేశారని తెలుస్తోంది. మరి పోలీసుల దర్యాప్తులో మరెన్ని కీలక విషయాలు బయటపడతాయో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat