Home / ANDHRAPRADESH / బిగ్ బ్రేకింగ్…త్వరలో సీఎం జగన్‌తో ఆదానీ భేటీ.. 70 వేల కోట్లతో అతి పెద్ద డేటా హబ్ ఏర్పాటు..!

బిగ్ బ్రేకింగ్…త్వరలో సీఎం జగన్‌తో ఆదానీ భేటీ.. 70 వేల కోట్లతో అతి పెద్ద డేటా హబ్ ఏర్పాటు..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అలా అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అంతే కాదు చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా చేసిన విద్యుత్ పీపీఏల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించింది. అంతే కాదు గత 9 నెలలుగా సీఎం జగన్ తీరుతో ఏపీలో పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని, ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి..కొత్త పరిశ్రమలు ఏవి రావడం లేదంటూ..చంద్రబాబు అనుకుల మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయి. అయితే జగన్ సర్కార్ ఇటీవల నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తోంది. ఈ క్రమంలో తన మిత్రుడు పరిమళ్ నత్వాని కోసం అమరావతికి వచ్చి సీఎం జగన్‌ను కలిసిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారు.

 

తాజాగా దేశంలోనే మరో అతి పెద్ద వ్యాపార దిగ్గజం ఆదానీ గ్రూపు కూడా ఏపీలో ఏకంగా 70 వేల కోట్లతో డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆదానీ గ్రూపుతో ఏపీ ప్రభుత్వ పెద్దలు చర్చించినట్లు ఏప్రిల్‌లో ఆదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ స్వయంగా అమరావతికి వచ్చి సీఎం జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలుస్తోంది. వైజాగ్‌లో 70 వేల కోట్ల పెట్టుబడితో అతి పెద్ద డేటా హబ్ నిర్మించడానికి ఆదానీ గ్రూప్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.గత ప్రభుత్వ హయాంలోనే వైజాగ్‌లో డేటాహబ్‌ ఏర్పాటుకు ఆదానీ గ్రూపు ముందుకు వచ్చినా..స్థల కేటాయింపు వివాదాస్పదం కావడంతో వెనక్కి తగ్గింది.

 

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ పరిశ్రమల శాఖ ఆదానీ గ్రూపుతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. వైజాగ్‌లో రాజధాని ఏర్పాటు ఖరారు కావడంతో ఆదాని గ్రూపు డేటా హబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదానీ గ్రూపు ఛైర్మన్ గౌతం ఆదానీ అమరావతికి వచ్చి సీఎం జగన్‌తో చర్చించి వైజాగ్‌లో డేటా హబ్ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని ఏపీ పరిశ్రమల వర్గాలు తెలుపుతున్నాయి. కాగా వైజాగ్‌‌లో రాజధాని ఏర్పాటు అయితే తమ ప్రాంతం పారిశ్రామికంగా డెవలప్ అవుతుందని, తమ ప్రాంతం వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. అందుకే వికేంద్రీకరణకు ఉత్తరాంధ్ర ప్రజలు జై కొడుతున్నారు. మొత్తంగా విశాఖలో రాజధాని ఏర్పాటుకు ముందే 70 వేల కోట్ల ఆదానీ గ్రూపు అతిపెద్ద డేటా హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఉత్తరాంధ్ర యువత పండుగ చేసుకుంటోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat