ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన పలువురు ఎమ్మెల్సీలు గెలుపొందారు. గురువారం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ,వైసీపీ నుండి బరిలోకి దిగిన పలువురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.వైసీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్సీలు వీరభద్రస్వామి,ఆళ్ల నాని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇక టీడీపీ నుండి ఏడుగురు ఎమ్మెల్సీలు బరిలోకి దిగితే అందులో ఇద్దరు మాత్రమే గెలుపొందారు.టీడీపీ తరపున బరిలోకి దిగిన మంత్రులు లోకేశ్,నారాయణ ,సోమిరెడ్డి,పయ్యావుల కేశవ్,కరణం బలరాం,డోక్కా,అన్నం సతీష్,కేఈ ప్రతాప్ పలువురు నేతలు ఎమ్మెల్యేలుగా పోటికి దిగితే వీరిలో కేవలం పయ్యావుల కేశవ్ ,కరణం బలరాం మాత్రమే గెలుపొందారు.మిగిలినవారు భారీ మెజారిటీతో ఓడిపోయారు.
